News September 21, 2025
పార్వతీపురం: ఈనెల 22న వారపు సంతల్లో వైద్య శిబిరాలు

పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన వారపు సంతల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది ఆదివారం వైద్యాధికారులను ఆదేశించారు. సంతలకు విచ్చేసే ప్రజల ఆరోగ్య, రక్త పరీక్షలతో రోగులకు ఉచిత వైద్యం, మందులు పంపిణీ చేయాలన్నారు. ఈనెల 22న పాలకొండ మండలం నవగాం, కురుపాం మండలం నీలకంఠాపురం, సీతంపేట మండలం సీతంపేటలో వారపు సంతల్లో వైద్య శిబిరాలు నిర్వహించి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
Similar News
News September 22, 2025
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి వెళుతున్నారా? మీ కోసమే..!

ప్రసిద్ధి చెందిన HYD జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ ఫౌండర్ పి.విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారు ప్రతి రోజు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నట్లు చెప్పారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. భక్తులు తరలిరావాలని కోరారు. SHARE IT
News September 22, 2025
KNR: మార్మోగిన శ్రీమహాశక్తి దేవాలయం ఆవరణం

కరీంనగర్ నగరంలో ఆదివారం బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని చైతన్యపురిలో ఉన్న శ్రీమహాశక్తి దేవాలయం ఆవరణలో మహిళలు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల బతుకమ్మలను తీసుకొచ్చి, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. బతుకమ్మ పాటలతో దేవాలయం ప్రాంగణమంతా మార్మోగిపోయింది.
News September 22, 2025
NZB: కవిత హాట్ కామెంట్స్

MLC కల్వకుంట్ల కవిత ఆదివారం హాట్ కామెంట్స్ చేశారు. తనను కుటుంబానికి దూరం చేసిన వారి భరతం పడతానని హెచ్చరిక జారీ చేశారు. సిద్దిపేట, చింతమడక తమ జాగీరుగా భావించే వాళ్లకు బుద్ది చెప్తామన్నారు. చంద్రుడి లాంటి కేసీఆర్ కు మచ్చ తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ లో సొంతూరే కర్మ భూమి కావచ్చని వ్యాఖ్యానించారు. సిద్దిపేట, చింతమడక రావాలంటే కేజీఎఫ్ లాగా ఇక్కడ ఆంక్షలు పెట్టారన్నారు.