News September 21, 2025
FLASH.. పెండింగ్ బిల్లులు చెల్లించలేదని కాళోజీ కళాక్షేత్రానికి తాళం

పెండింగ్ బిల్లులు చెల్లించలేదని కాళోజీ కళాక్షేత్రానికి కాంట్రాక్టర్ తాళం వేశాడు. రూ.4కోట్ల బిల్లులు ఇవ్వట్లేదని హన్మకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రానికి కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తాళం వేశాడు. కార్యక్రమం కోసం వెళ్లగా, తాళం వేసి ఉండటంతో అధికారులు ఖంగుతిన్నారు. కార్యక్రమాలు జరగకుండా తాళం వేసినందుకు కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డిపై అధికారులు ఫిర్యాదు చేయగా సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 22, 2025
PDPL: హార్వెస్టర్ యజమానులతో రేపు కీలక సమావేశం

పెదపల్లి జిల్లాలోని అన్ని వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులకు, హార్వెస్టర్ యజమానులకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హార్వెస్టర్ యజమానుల పాత్ర, విధులు, నియమనిబంధనలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి యాజమాన్యాలు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
News September 22, 2025
జగిత్యాల: PRIVATEలో JOBS..!

జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రేపు జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సత్యమ్మ తెలిపారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 100 ఖాళీలు ఉన్నాయని, 2025లో ఇంటర్లో ఉత్తీర్ణత సాధించి 17- 20 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులన్నారు. వేతనం రూ.17,000 ఉంటుందని, వివరాలకు 9154679103 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News September 22, 2025
బిగ్ బాస్: ఎలిమినేట్ ఎవరంటే?

బిగ్ బాస్ హౌస్ సీజన్-9 రెండో వీక్‌లో కామన్ మ్యాన్ మనీశ్ మర్యాద ఎలిమినేట్ అయ్యారు. ఈసారి నామినేషన్లలో మొత్తం ఏడుగురు ఉండగా తక్కువ ఓట్లు వచ్చిన మనీశ్‌ను ఎలిమినేట్ చేస్తున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. టాప్-4లో భరణి, ఇమ్మాన్యుయేల్, సంజన, హరిత హరీశ్‌లు ఉంటారని మనీశ్ అభిప్రాయపడ్డారు. తొలి వారం కొరియోగ్రఫర్ శ్రష్ఠి వర్మ హౌస్ నుంచి బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే.