News September 21, 2025

ఖమ్మం జిల్లాలో ఉత్సాహంగా పూల పండుగ

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు తమ గ్రామాల్లో అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను పేర్చి, యువతులు, మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. దీంతో ప్రతీ గ్రామం బతుకమ్మ పాటలతో మార్మోగిపోయింది. ఈ ఉత్సవాలు రానున్న 9 రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి.

Similar News

News September 22, 2025

సెప్టెంబర్ 22: చరిత్రలో ఈరోజు

image

1936: దర్శకుడు విజయ బాపినీడు జననం
1948: రంగస్థల నటుడు, దర్శకుడు మల్లాది గోపాలకృష్ణ జననం
1952: రచయిత, కళాకారుడు అడివి బాపిరాజు మరణం
1987: సినీ నటుడు ఉన్నిముకుందన్ జననం(ఫొటోలో)
2004: సంగీత దర్శకుడు బి.గోపాలం మరణం
2009: నటి, గాయని ఎస్.వరలక్ష్మి మరణం
➤క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం

News September 22, 2025

వరంగల్: భారీ క్యూ లైన్.. ఎందుకో తెలుసా..?

image

WGL జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పై ఫొటోలో కనిపిస్తున్న భారీ క్యూ లైన్ ఎందుకో గెస్ చేయండి. ప్రస్తుతం ఎక్కడ చూసినా యూరియా క్యూలైన్లు మనకు కనిపిస్తున్నాయి. అలా, ఇది కూడా యూరియా కోసమే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. పితృ అమావాస్య సందర్భంగా పెద్దలకు బియ్యం ఇవ్వడం మన సాంప్రదాయం. దీనిలో భాగంగా రాయపర్తి అర్చకుడు ఆరుట్ల రామకృష్ణ చార్యులు ఇంటి ముందు తమ పూర్వీకులకు బియ్యం ఇచ్చేందుకు ఇలా క్యూ కట్టారు.

News September 22, 2025

మహిళలతో కిక్కిరిసిన వేయి స్తంభాల గుడి

image

సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహిళలలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించి పేర్చిన బతుకమ్మలతో మహిళలందరూ భారీగా వేయి స్తంభాల గుడికి చేరుకొని సందడి చేశారు. చిన్నారులు, మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి డీజే పాటలకు అనుగుణంగా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ పండగ శోభను మరింత పెంచారు. మహిళలతో గుడి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.