News September 21, 2025
పండుగ పూట తీవ్ర విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి

కరీంనగర్‌లో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. బొమ్మకల్ రోడ్డులో ఉన్న సిమెంట్ పైపుల ఫ్యాక్టరీలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. బిహార్‌కు చెందిన బిట్టు కుమార్-సుధాదేవి కుమారులు సత్యం కుమార్, ఆర్యన్ కుమార్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు పైపులు కూలింగ్ చేసే ట్యాంకులో పడిపోయారు. గమనించిన ఫ్యాక్టరీ సిబ్బంది వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 22, 2025
వరంగల్: బతుకమ్మను బతకనివ్వండి..!

బతుకమ్మను బతకనిద్దాం.. భ్రూణ హత్యలు నివారిద్దామని లాస్యప్రియ అన్నారు. ఎంగిలి పూల బతుకమ్మ రోజున HNK నయీం నగర్ ప్రాంతానికి చెందిన లాస్య సాయి ప్రకాశ్ ఆడ పిల్లల్ని కడుపులో ఉండగానే చంపుతున్నరాని, అలా చంపడం నేరమని., వాటిని నిర్మూలించాలని కోరుతూ ప్లే కార్డ్ పట్టుకొని బతుకమ్మను బతకనిద్దాం.. భ్రూణ హత్యలు నివారిద్దామనే సందేశాన్ని అందించారు. వినూత్నంగా ఆలోచానను అందరు అభినందించారు.
News September 22, 2025
బీసీ కోటాను ఖరారు చేయాలని అధికారులకు CS ఆదేశాలు!

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. 42% బీసీ రిజర్వేషన్ల కోటాను 4-5 రోజుల్లో ఖరారు చేయాలని పంచాయతీ రాజ్ అధికారులను CS రామకృష్ణారావు ఆదేశించినట్లు తెలుస్తోంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. BC బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా ప్రభుత్వం జీవోతో కోటాను అమలు చేస్తుందా అనేది ప్రశ్నగా మారింది.
News September 22, 2025
సెప్టెంబర్ 22: చరిత్రలో ఈరోజు

1936: దర్శకుడు విజయ బాపినీడు జననం
1948: రంగస్థల నటుడు, దర్శకుడు మల్లాది గోపాలకృష్ణ జననం
1952: రచయిత, కళాకారుడు అడివి బాపిరాజు మరణం
1987: సినీ నటుడు ఉన్నిముకుందన్ జననం(ఫొటోలో)
2004: సంగీత దర్శకుడు బి.గోపాలం మరణం
2009: నటి, గాయని ఎస్.వరలక్ష్మి మరణం
➤క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం