News September 21, 2025
మెదక్: ‘అమెండ్‌మెంట్ ఉత్తర్వులు ఇప్పించాలి’

ఇన్ సర్వీస్ టీచర్స్‌కి టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా NCTE నిబంధనలు అమెండ్ మెంట్ ఉత్తర్వులు ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి MLC శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు PRTU TS విజ్ఞప్తి చేసినట్లు అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి తెలిపారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, సర్వీస్ రూల్స్ అమలుపరిచేలా తగిన సహకారం అందించాలన్నారు.
Similar News
News September 21, 2025
మెదక్: ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ: కలెక్టర్

పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ స్త్రీ శక్తిని ప్రతిబింబించే పండుగగా నిలుస్తుందన్నారు. ఈసారి చెరువులు నిండుగా ఉన్నందున బతుకమ్మలు నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ సంబరాల సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.
News September 21, 2025
మెదక్: ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టండి: పీడీ

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పనులు మొదలుపెట్టాలని హౌసింగ్ పీడీ మాణిక్యం సూచించారు. జిల్లాలో 9,156 ఇళ్లు మంజూరు కాగా, 5,511 ఇళ్ల పనులు మొదలయ్యాయన్నారు. ఇందులో ఐదు పూర్తి కాగా బెస్మెంట్ లేవల్‌లో 2,408, లెంటల్ లేవల్‌లో 295, స్లాబ్ లేవల్‌లో 124 ఉన్నాయన్నారు. 2,832 ఇళ్లకు బిల్ జనరేట్ కాగా 2,500 మందికి బిల్లులు జమ అయ్యాయని వివరించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.
News September 21, 2025
మెదక్: ‘జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు’

జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార, వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.