News September 22, 2025

US H-1Bకి పోటీగా చైనా ‘K వీసా’!

image

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంటెడ్ ప్రొఫెషనల్స్‌ను ఆకర్షించేందుకు చైనా కొత్తగా ‘K వీసా’ను ప్రవేశపెట్టింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ & మ్యాథమెటిక్స్ (STEM) రంగాల్లో స్కిల్డ్ మ్యాన్‌ఫోర్స్ కోసం OCT 1 నుంచి ఈ వీసాను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. నిపుణులు దీన్ని US H-1B వీసాకు పోటీగా అభివర్ణిస్తున్నారు. వీసా ఫీజును US లక్ష డాలర్లకు పెంచడం చైనాకు కలిసొచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

Similar News

News September 22, 2025

ఇవాళ విశాఖకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ వైజాగ్‌లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు జరిగే జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సును ఆయన ప్రారంభిస్తారు. ఈ ఏడాది ‘సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్’ థీమ్‌తో ఈ కాంక్లేవ్‌ను నిర్వహిస్తున్నారు. AI, సైబర్ సెక్యూరిటీ, పౌర సేవలు, అగ్రి-స్టాక్ వంటి అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

News September 22, 2025

పవన్ అభిమానులకు ఇంకా నిరీక్షణే..

image

పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘OG’ ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. నిన్ననే ట్రైలర్ రావాల్సి ఉండగా పలు కారణాలతో రిలీజ్ కాలేదు. అయితే సినిమా విడుదలకు దగ్గర పడుతున్నా ట్రైలర్ రాకపోవడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ట్రైలర్ ఛాన్స్ ఉండటంతో రెండు రోజులు ముందు విడుదల చేస్తే ఎలా అని అంటున్నారు. ఇలాంటివి సరిగ్గా ప్లాన్ చేసుకోవాలని దర్శకనిర్మాతలకు సూచిస్తున్నారు.

News September 22, 2025

బీసీ కోటాను ఖరారు చేయాలని అధికారులకు CS ఆదేశాలు!

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. 42% బీసీ రిజర్వేషన్ల కోటాను 4-5 రోజుల్లో ఖరారు చేయాలని పంచాయతీ రాజ్ అధికారులను CS రామకృష్ణారావు ఆదేశించినట్లు తెలుస్తోంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. BC బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా ప్రభుత్వం జీవోతో కోటాను అమలు చేస్తుందా అనేది ప్రశ్నగా మారింది.