News September 22, 2025
యాదాద్రిపై రేపటి నుంచి శరన్నవరాత్రోత్సవాలు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై ఉన్న శ్రీ పర్వతవర్ధినీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి అర్చనలు, లక్ష కుంకుమార్చనలు, చండీ హోమం నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.
Similar News
News September 22, 2025
రోజూవారి అమ్మవారి అలంకరణ

Day 1- గులాబీ రంగు చీర, మందారాలు
Day 2- నారింజ రంగు చీర, తామర/కలువ పూలు
Day 3- నీలం రంగు చీర, మల్లెలు
Day 4- పసుపు రంగు చీర, మందారాలు, మల్లెలు
Day 5- గులాబీ రంగు చీర, ఎర్ర గులాబీలు, కలువలు
Day 6- పసుపు చీర, గులాబీలు, Day 7- బంగారు రంగు చీర, పసుపు రంగు పూలు, Day 8- తెల్ల చీర, తెల్ల తామర, Day 9- ఎర్ర చీర, ఎర్ర పూలు, Day 10- నీలం చీర, శంఖు పూలు
Day 11- ఆకుపచ్చ చీర, కలువ పూలు
News September 22, 2025
పూల అందాలతో ఆహ్వానిస్తున్న హైవే-161

నాలుగు వరుసల రహదారి మధ్యలో ఈ చెట్లకు పూసిన పసుపు పచ్చని పూలు. ఈ సీన్ చూస్తుంటే కనువిందు చేస్తుంది కదూ. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో నిజాంసాగర్ నుంచి మద్నూర్ వరకు 75 కిలోమీటర్ల మేర విస్తరించిన
హైవే-161 పై గతంలో నాటించిన పూల మొక్కలు ప్రస్తుతం వికసించాయి. ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులకు పచ్చని గడ్డి, పసుపు పచ్చని పూలు కనువిందు చేస్తూ కట్టి పడేస్తుంటాయి.
News September 22, 2025
పిట్లం: 20 ఏళ్లుగా ఈత బరిగెలతో బతుకమ్మలు..

పిట్లంకు చెందిన అబ్దుల్ ఖదీర్ గత 20 ఏళ్లుగా ఈత బరిగేలతో బతుకమ్మలు తయారు చేస్తున్నారు. పండుగకు నెల రోజుల ముందే అడవికి వెళ్లి ఈత బరిగేలు సేకరిస్తారు. వాటిని శుభ్రం చేసి, ప్రత్యేక పద్ధతిలో అల్లి అందమైన బతుకమ్మలుగా మారుస్తారు. ఈ సంప్రదాయ కళను ఆయన రెండు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఆధునిక కాలంలో కూడా తన కళను బతికించుకుంటూ, బతుకమ్మ పండుగకు కొత్త శోభను తీసుకొస్తున్నారు.