News September 22, 2025

‘ఇది నా మరణ వాంగ్మూలం’.. మాజీ డీఎస్పీ పోస్ట్

image

TG: మాజీ డీఎస్పీ నళిని తన ‘మరణ వాంగ్మూలం’ అంటూ FBలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. తన ఆరోగ్య పరిస్థితి కొంత కాలంగా ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ‘నా జీవితం ముగియబోతోంది. సాయం చేయాలని CMకు ఇచ్చిన అర్జీ బుట్టదాఖలైంది. కేంద్రం సాయం చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాను. నేను స్థాపించిన వేదామృతం ట్రస్టుకు నా మరణానంతరం మోదీ సాయం చేయాలి. నా మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు’ అని పేర్కొన్నారు.

Similar News

News September 22, 2025

రోజూవారి అమ్మవారి అలంకరణ

image

Day 1- గులాబీ రంగు చీర, మందారాలు
Day 2- నారింజ రంగు చీర, తామర/కలువ పూలు
Day 3- నీలం రంగు చీర, మల్లెలు
Day 4- పసుపు రంగు చీర, మందారాలు, మల్లెలు
Day 5- గులాబీ రంగు చీర, ఎర్ర గులాబీలు, కలువలు
Day 6- పసుపు చీర, గులాబీలు, Day 7- బంగారు రంగు చీర, పసుపు రంగు పూలు, Day 8- తెల్ల చీర, తెల్ల తామర, Day 9- ఎర్ర చీర, ఎర్ర పూలు, Day 10- నీలం చీర, శంఖు పూలు
Day 11- ఆకుపచ్చ చీర, కలువ పూలు

News September 22, 2025

13,217 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

image

దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును IBPS ఈ నెల 28 వరకు పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. CBT, ఇంటర్వ్యూ, ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ద్వారా ఎంపిక ఉంటుంది. కనీసం డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఏపీ గ్రామీణ బ్యాంక్‌లో 152, తెలంగాణ గ్రామీణ్ బ్యాంక్‌లో 798 పోస్టులు ఉన్నాయి. మరిన్ని వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 22, 2025

నేటి నుంచి దుర్గా నవరాత్రులు.. బాలాత్రిపుర సుందరీగా అమ్మవారు

image

దేశవ్యాప్తంగా నేటి నుంచి దుర్గామాత నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై, వరంగల్‌లోని భద్రకాళి ఆలయాల్లో 11 రోజుల పాటు అమ్మవార్లు పలు అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. ఇవాళ బాలా త్రిపుర సుందరీదేవీగా కనిపించనున్నారు. అటు శ్రీశైలంలో భ్రమరాంభికా దేవి శైలపుత్రి అలంకారంలో దర్శనమిస్తారు. కాగా నేడు 2-10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించడం ఆనవాయితీ.