News September 22, 2025

FLASH: HYD-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద

image

హయత్‌నగర్‌లో HYD-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి సమీప రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులకు మరోసారి ఇబ్బందులు తప్పడం లేదు. అటు దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు బయలు దేరిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Similar News

News September 22, 2025

నవరాత్రులు: నేడు అమ్మవారిని ఎలా పూజించాలంటే?

image

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నేడు బాలాత్రిపురసుందరీ దేవిగా అమ్మవారు అలంకృతమై భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు అమ్మవారికి గులాబీ రంగు చీర, మందార పువ్వులు సమర్పించి, పరమాన్నం/రైస్ ఖీర్ నైవేద్యంగా పెడతారు. ఈరోజున లలితా త్రిశతి పారాయణం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తుందని అంటున్నారు.

News September 22, 2025

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలో నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News September 22, 2025

అమ్మవారికి ఏ రోజున ఏ నైవేద్యం పెట్టాలంటే?

image

Sept 22 – పరమన్నం/రైస్ ఖీర్
Sept 23 – కొబ్బరి అన్నం, అల్లపు గారెలు
Sept 24 – మినప వడలు/పులిహోర
Sept 25 – పాయసం, రవ్వ కేసరి
Sept 26 – పూర్ణాలు, రవ్వ కేసరి
Sept 27 – రవ్వ కేసరి/పాయసన్నం
Sept 28 – కట్టు పొంగలి, Sept 29 – పాయసం, శాఖన్నం
Sept 30 – కదంబం/కలగలుపు కూర
Oct 1 – చక్కెర పొంగలి, Oct 2 – దద్దోజనం, మహా నివేదన