News April 5, 2024

శ్రీకాకుళం: రేపటి నుంచి పాఠశాలల్లో వార్షిక పరీక్షలు

image

జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలో వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఈ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఈనెల 19వ తేదీతో ముగియనున్నాయి. ప్రశ్న పత్రాలు మండల రిసోర్స్ కార్యాలయం నుంచి పాఠశాల సముదాయాలకు.. అక్కడ నుంచి సంబంధిత పాఠశాలకు ఈ ప్రశ్న పత్రాలు వెళతాయని అధికారులు తెలిపారు.

Similar News

News January 23, 2026

SKLM: నేడు అలరించనున్న ప్రత్యేక షోలు ఇవే

image

➤మధ్యాహ్నం 2గం నుంచి డై&నైట్ కూడలి నుంచి అరసవల్లి వరకు శోభాయాత్ర
➤సాయంత్రం 5గం.సాక్సోఫోన్, శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ఆరోహి మ్యూజికల్ అకాడమీ షోలు
➤రాత్రి 7గం.నుంచి జబర్దస్త్ టీమ్ తో కామెడీ షో, ఢీ డాన్సర్స్ బృందంతో నృత్యాలు
➤ జానపద గీతాలు ఆలాపన
➤అద్భుతమైన లేజర్, డ్రోన్ షో
ఈ కార్యక్రమాల గురించి అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

News January 23, 2026

SKLM: ప్రతి 10ని.లకు ప్రత్యేక బస్సు

image

రథసప్తమి వేడుకల సందర్భంగా ఈ నెల 25న RTC ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సి.హెచ్. అప్పల నారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణీకుల సౌకర్యార్థం, విశాఖ, విజయనగరం, రాజాం, పాలకొండ, బత్తిలి, శ్రీముఖలింగం, పాతపట్నం, టెక్కలి, పలాస నుంచి సాధారణ ఛార్జీలతో నడుస్తాయన్నారు. ప్రతి 10 నిమిషాలకు ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు.

News January 22, 2026

నరసన్నపేటలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు..వైసీపీ ఆరోపణ

image

నరసన్నపేట మండలం తామరపల్లిలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్‌ నిర్మాణాలు జరుగుతున్నట్లు వైసీపీ ఆరోపించింది. ఈ కట్టడాలపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని, అధికార పార్టీ నాయకుల అండతోనే నిర్మాణాలు చేపడుతున్నా.. యంత్రాంగం అడ్డుకోలేదని వైసీపీ విమర్శించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆ పార్టీ ఓ వీడియోను పోస్టు చేసింది.