News September 22, 2025
అమల్లోకి కొత్త జీఎస్టీ.. తగ్గిన ధరలు

దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇకపై 5%, 18% శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్ని లగ్జరీ వస్తువులను 40% లిస్టులో చేర్చారు. ఆహారం, పాల ఉత్పత్తులు, FMCG, ఎలక్ట్రానిక్స్, వాహనాలతో పాటు సుమారుగా 200కు పైగా వస్తువుల ధరలు తగ్గాయి. ఇక దసరా సీజన్ కూడా మొదలవ్వడంతో కంపెనీలు మరింత ధరలు తగ్గించే అవకాశముంది. దీంతో షోరూమ్స్‌లో కొనుగోలుదారులతో సందడి నెలకొననుంది.
Similar News
News January 17, 2026
323 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా<
News January 17, 2026
మట్టి బొమ్మలను దర్శించుకోవడంలో అంతరార్థం ఇదే

సంక్రాంతి వేడుకల్లో భాగంగా ముక్కనుమ నాడు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ఇందులో రంగురంగుల మట్టి బొమ్మలను కొలువు తీర్చి పూజిస్తారు. మట్టి నుంచి పుట్టిన ప్రాణి, చివరికి మట్టిలోనే కలుస్తుందనే జీవిత పరమార్థాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది. ప్రకృతిని(మట్టిని) గౌరీ మాతగా భావించి ఆరాధించడం వల్ల, ఆ తల్లి కరుణతో ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News January 17, 2026
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినాలి

స్కిన్ ఆరోగ్యంగా, బిగుతుగా ఉండాలంటే తగినంత నీరు తాగాలి. నీటిని సమృద్ధిగా తాగితే చర్మం సాగదు, ముడతలు పడకుండా మెరుస్తూ ఉంటుంది. అందుకే ఈ విటమిన్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలుండే పదార్థాలను రోజూ తీసుకోవాలి. రాజ్మా, అవిసెగింజలు, బాదం, కాజులనూ తీసుకోవాలి. విటమిన్-సి ఉండే జామ, ఉసిరి తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగానూ ఉంచుతాయి. కొబ్బరి, సోయాబీన్, మొలకలు కూడా తీసుకోవాలి.


