News September 22, 2025
బీసీ కోటాను ఖరారు చేయాలని అధికారులకు CS ఆదేశాలు!

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. 42% బీసీ రిజర్వేషన్ల కోటాను 4-5 రోజుల్లో ఖరారు చేయాలని పంచాయతీ రాజ్ అధికారులను CS రామకృష్ణారావు ఆదేశించినట్లు తెలుస్తోంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. BC బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా ప్రభుత్వం జీవోతో కోటాను అమలు చేస్తుందా అనేది ప్రశ్నగా మారింది.
Similar News
News September 22, 2025
నేటి నుంచి సెలవులు

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రకటన ప్రకారం ఇవాళ్టి నుంచి దసరా సెలవులు అమల్లోకి వచ్చాయి. APలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు, TGలో అక్టోబర్ 3 వరకు హాలిడేస్ ఉండనున్నాయి. అయితే విద్యార్థులకు నిన్న ఆదివారం కలిసి రావడంతో ఇప్పటికే హాలిడేస్ ఎంజాయ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక స్కూల్స్ రీఓపెన్ అయ్యే OCT 3, 4న శుక్ర, శనివారాలు కావడంతో స్టూడెంట్స్ ఆదివారం మరుసటి రోజు సోమవారం(6న) బడిబాట పట్టే అవకాశముంది.
News September 22, 2025
వచ్చే నెలలో ప్రభుత్వ ఇంటర్ కాలేజీలకు డిజిటల్ స్క్రీన్లు

TG: సర్కారు జూనియర్ కాలేజీల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో వీటిని కళాశాలలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటి ఏర్పాటు కోసం ప్రతీ కాలేజీకి ఫ్రీ ఇంటర్నెట్, జూమ్ కనెక్షన్ సదుపాయం కల్పించనున్నారు. ఈ స్క్రీన్ల ద్వారా జేఈఈ, నీట్, ఎప్ సెట్ తదితర ప్రవేశపరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
News September 22, 2025
నవరాత్రులు: నేడు అమ్మవారిని ఎలా పూజించాలంటే?

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నేడు బాలాత్రిపురసుందరీ దేవిగా అమ్మవారు అలంకృతమై భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు అమ్మవారికి గులాబీ రంగు చీర, మందార పువ్వులు సమర్పించి, పరమాన్నం/రైస్ ఖీర్ నైవేద్యంగా పెడతారు. ఈరోజున లలితా త్రిశతి పారాయణం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తుందని అంటున్నారు.