News September 22, 2025

వరంగల్: బతుకమ్మను బతకనివ్వండి..!

image

బతుకమ్మను బతకనిద్దాం.. భ్రూణ హత్యలు నివారిద్దామని లాస్యప్రియ అన్నారు. ఎంగిలి పూల బతుకమ్మ రోజున HNK నయీం నగర్ ప్రాంతానికి చెందిన లాస్య సాయి ప్రకాశ్ ఆడ పిల్లల్ని కడుపులో ఉండగానే చంపుతున్నరాని, అలా చంపడం నేరమని., వాటిని నిర్మూలించాలని కోరుతూ ప్లే కార్డ్ పట్టుకొని బతుకమ్మను బతకనిద్దాం.. భ్రూణ హత్యలు నివారిద్దామనే సందేశాన్ని అందించారు. వినూత్నంగా ఆలోచానను అందరు అభినందించారు.

Similar News

News September 22, 2025

నేటి నుంచి సెలవులు

image

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రకటన ప్రకారం ఇవాళ్టి నుంచి దసరా సెలవులు అమల్లోకి వచ్చాయి. APలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు, TGలో అక్టోబర్ 3 వరకు హాలిడేస్ ఉండనున్నాయి. అయితే విద్యార్థులకు నిన్న ఆదివారం కలిసి రావడంతో ఇప్పటికే హాలిడేస్ ఎంజాయ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక స్కూల్స్ రీఓపెన్ అయ్యే OCT 3, 4న శుక్ర, శనివారాలు కావడంతో స్టూడెంట్స్ ఆదివారం మరుసటి రోజు సోమవారం(6న) బడిబాట పట్టే అవకాశముంది.

News September 22, 2025

వచ్చే నెలలో ప్రభుత్వ ఇంటర్ కాలేజీలకు డిజిటల్ స్క్రీన్లు

image

TG: సర్కారు జూనియర్ కాలేజీల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో వీటిని కళాశాలలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటి ఏర్పాటు కోసం ప్రతీ కాలేజీకి ఫ్రీ ఇంటర్నెట్, జూమ్ కనెక్షన్ సదుపాయం కల్పించనున్నారు. ఈ స్క్రీన్ల ద్వారా జేఈఈ, నీట్, ఎప్ సెట్ తదితర ప్రవేశపరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

News September 22, 2025

నవరాత్రులు: నేడు అమ్మవారిని ఎలా పూజించాలంటే?

image

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నేడు బాలాత్రిపురసుందరీ దేవిగా అమ్మవారు అలంకృతమై భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు అమ్మవారికి గులాబీ రంగు చీర, మందార పువ్వులు సమర్పించి, పరమాన్నం/రైస్ ఖీర్ నైవేద్యంగా పెడతారు. ఈరోజున లలితా త్రిశతి పారాయణం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తుందని అంటున్నారు.