News September 22, 2025

దసరా సెలవుల్లో ఊరేళ్లే వారికి సిరిసిల్ల ఎస్పీ సూచనలు

image

దసరా సెలవుల సందర్భంగా దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రజలను సూచించారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఇంటికి తాళాలు వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ అలారాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Similar News

News September 22, 2025

నవరాత్రి ఉత్సవాలు షురూ..

image

దేశవ్యాప్తంగా దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా విజయవాడలో తొలిరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీగా దర్శనమివ్వనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. రేపటి నుంచి ఉ.4 గంటలకే అనుమతిస్తారు. అటు గ్రామాల్లోనూ దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు.

News September 22, 2025

ఎల్లుండి విజయవాడకు సీపీ రాధాకృష్ణన్

image

AP: నూతన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఎల్లుండి విజయవాడలో పర్యటించనున్నారు. తొలుత ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం పున్నమిఘాట్‌లో జరిగే ‘విజయవాడ ఉత్సవ్’లో పాల్గొంటారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం తెలిపింది. ఇటీవల సీపీ రాధాకృష్ణన్‌ను కలిసిన ఎంపీ, విజయవాడ ఉత్సవ్‌కు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆ మేరకు ఆయన విచ్చేయనున్నారు.

News September 22, 2025

కృష్ణా: నేడు బాలా త్రిపుర సుందరిగా దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ

image

శరన్నవరాత్రులలో తొలి రోజైన నేడు సోమవారం బాలా త్రిపురసుందరి దేవిగా విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం బాలాత్రిపురసుందరీదేవి అని, ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగుతాయని, సర్వ సంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. మహిమాన్వితమైన శ్రీ బాలా మంత్రం సమస్త దేవీమంత్రాల్లోకెల్లా అత్యున్నతమైనదని ఉపాసకులు చెబుతారు.