News September 22, 2025
పిట్లం: 20 ఏళ్లుగా ఈత బరిగెలతో బతుకమ్మలు..

పిట్లంకు చెందిన అబ్దుల్ ఖదీర్ గత 20 ఏళ్లుగా ఈత బరిగేలతో బతుకమ్మలు తయారు చేస్తున్నారు. పండుగకు నెల రోజుల ముందే అడవికి వెళ్లి ఈత బరిగేలు సేకరిస్తారు. వాటిని శుభ్రం చేసి, ప్రత్యేక పద్ధతిలో అల్లి అందమైన బతుకమ్మలుగా మారుస్తారు. ఈ సంప్రదాయ కళను ఆయన రెండు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఆధునిక కాలంలో కూడా తన కళను బతికించుకుంటూ, బతుకమ్మ పండుగకు కొత్త శోభను తీసుకొస్తున్నారు.
Similar News
News September 22, 2025
జన్నారం: 26 మంది అరెస్ట్.. కారణమిదే!

జన్నారంలో నిన్న <<17780717>>26 మంది<<>> ఆదివాసీలను అరెస్ట్ చేశారు. ASF జిల్లా లింగాపూర్, సిర్పూర్ (U), జైనూర్‌కు చెందిన గిరిజనులు కవ్వాల్‌లోని పాలగోరి భూములు తమ పూర్వీకులవేనని ఆక్రమించుకున్నారు. అక్కడే గుడిసెలు వేసుకొని 280 టేకు చెట్లు నరికివేశారని, అటవీ సిబ్బందిపై కారం చల్లి పలుమార్లు దాడి చేశారని FDO వెల్లడించారు. 1940 నుంచి ఆ భూములు అటవీ శాఖకు చెందినవని అధికారులు రికార్డులు చూపుతున్నారు.
News September 22, 2025
JGTL: 1,700 కిలోల పూలు.. 16 అడుగుల ఎత్తు..!

రాష్ట్రంలో నిమజ్జనం చేసే అతిపెద్ద బతుకమ్మ జగిత్యాల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే బతుకమ్మ. 2016లో 10.5 అడుగుల వెడల్పు, 16 అడుగుల ఎత్తుతో 1,700 KGల పూలతో తయారుచేసిన బతుకమ్మ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఇక అప్పట్నుంచి ఏటా మహా బతుకమ్మ పేరుతో అదే రీతిలో బతుకమ్మను పేరుస్తూ ఘనంగా సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
News September 22, 2025
NLG: సమృద్ధిగా వర్షాలు.. చేప పిల్లల పంపిణీలో జాప్యం

ఈ ఏడాది జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలు నిండుగా ఉన్నాయి.. చేప పిల్లల పంపిణీకి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పంపిణీ ఆలస్యమవుతోంది. దీంతో మత్స్యకార్మిక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. జిల్లాలో మొత్తం 260 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. అయితే, ఉచిత చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వల్ల టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది.