News September 22, 2025

పూల అందాలతో ఆహ్వానిస్తున్న హైవే-161

image

నాలుగు వరుసల రహదారి మధ్యలో ఈ చెట్లకు పూసిన పసుపు పచ్చని పూలు. ఈ సీన్ చూస్తుంటే కనువిందు చేస్తుంది కదూ. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో నిజాంసాగర్ నుంచి మద్నూర్‌ వరకు 75 కిలోమీటర్ల మేర విస్తరించిన
హైవే-161 పై గతంలో నాటించిన పూల మొక్కలు ప్రస్తుతం వికసించాయి. ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులకు పచ్చని గడ్డి, పసుపు పచ్చని పూలు కనువిందు చేస్తూ కట్టి పడేస్తుంటాయి.

Similar News

News September 22, 2025

జన్నారం: 26 మంది అరెస్ట్.. కారణమిదే!

image

జన్నారంలో నిన్న <<17780717>>26 మంది<<>> ఆదివాసీలను అరెస్ట్ చేశారు. ASF జిల్లా లింగాపూర్, సిర్పూర్ (U), జైనూర్‌కు చెందిన గిరిజనులు కవ్వాల్‌లోని పాలగోరి భూములు తమ పూర్వీకులవేనని ఆక్రమించుకున్నారు. అక్కడే గుడిసెలు వేసుకొని 280 టేకు చెట్లు నరికివేశారని, అటవీ సిబ్బందిపై కారం చల్లి పలుమార్లు దాడి చేశారని FDO వెల్లడించారు. 1940 నుంచి ఆ భూములు అటవీ శాఖకు చెందినవని అధికారులు రికార్డులు చూపుతున్నారు.

News September 22, 2025

JGTL: 1,700 కిలోల పూలు.. 16 అడుగుల ఎత్తు..!

image

రాష్ట్రంలో నిమజ్జనం చేసే అతిపెద్ద బతుకమ్మ జగిత్యాల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే బతుకమ్మ. 2016లో 10.5 అడుగుల వెడల్పు, 16 అడుగుల ఎత్తుతో 1,700 KGల పూలతో తయారుచేసిన బతుకమ్మ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఇక అప్పట్నుంచి ఏటా మహా బతుకమ్మ పేరుతో అదే రీతిలో బతుకమ్మను పేరుస్తూ ఘనంగా సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

News September 22, 2025

NLG: సమృద్ధిగా వర్షాలు.. చేప పిల్లల పంపిణీలో జాప్యం

image

ఈ ఏడాది జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలు నిండుగా ఉన్నాయి.. చేప పిల్లల పంపిణీకి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పంపిణీ ఆలస్యమవుతోంది. దీంతో మత్స్యకార్మిక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. జిల్లాలో మొత్తం 260 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. అయితే, ఉచిత చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వల్ల టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది.