News September 22, 2025
నేటి నుంచి సెలవులు

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రకటన ప్రకారం ఇవాళ్టి నుంచి దసరా సెలవులు అమల్లోకి వచ్చాయి. APలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు, TGలో అక్టోబర్ 3 వరకు హాలిడేస్ ఉండనున్నాయి. అయితే విద్యార్థులకు నిన్న ఆదివారం కలిసి రావడంతో ఇప్పటికే హాలిడేస్ ఎంజాయ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక స్కూల్స్ రీఓపెన్ అయ్యే OCT 3, 4న శుక్ర, శనివారాలు కావడంతో స్టూడెంట్స్ ఆదివారం మరుసటి రోజు సోమవారం(6న) బడిబాట పట్టే అవకాశముంది.
Similar News
News September 22, 2025
పెన్షన్ల పంపిణీ నిలిపివేస్తాం: సచివాలయ ఉద్యోగ జేఏసీ

AP: ఈనెల 27లోపు తమ డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. లేదంటే అక్టోబర్ 1 నుంచి పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తామని హెచ్చరించింది. నిరసనలో భాగంగా ఈనెల 23,24,25 తేదీల్లో కలెక్టర్లు, ఇతర అధికారులకు జేఏసీ తరఫున నోటీసులు అందజేస్తామన్నారు. 26,27న ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపుల నుంచి ఉద్యోగులంతా స్వచ్ఛందంగా వైదొలుగుతారని పేర్కొంది.
News September 22, 2025
H1B వీసాల ప్రభావం.. ఐటీ షేర్లు ఢమాల్

H1B వీసాల ఫీజు పెంపు ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. సెన్సెక్స్ 300 పాయింట్లు కోల్పోయి 82,363 వద్ద, నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయి 25,264 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా H1B వీసాల ప్రభావంతో టెక్ మహీంద్రా, TCS, ఇన్ఫోసిస్, HCL టెక్ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, అదానీ పోర్ట్స్, ఎటర్నల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
News September 22, 2025
కారణం లేకుండా మాపైకి రావడంతో దీటుగా బదులిచ్చా: అభిషేక్

ASIA CUP: నిన్నటి భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ- రౌఫ్, అఫ్రీది మధ్య హీటెడ్ డిస్కషన్ జరిగింది. వీటిపై అభిషేక్ స్పందిస్తూ.. ‘కారణం లేకుండా పాక్ ప్లేయర్లు మాపైకి వచ్చారు. అది నాకు నచ్చలేదు. అందుకే వారికి దీటుగా బదులిచ్చా. జట్టు విజయం కోసం పోరాడా’ అని చెప్పారు. గిల్‌తో భాగస్వామ్యంపై మాట్లాడుతూ.. ‘ఇద్దరం స్కూల్ డేస్ నుంచి కలిసి ఆడుతున్నాం. ఒకరి ఆటను మరొకరం గౌరవిస్తాం’ అని చెప్పారు.