News September 22, 2025

జీఎస్టీ ఎఫెక్ట్.. రూ.85వేల వరకు తగ్గిన ధరలు

image

టీవీలపై జీఎస్టీ శ్లాబు మార్పుతో పలు కంపెనీలు రూ.85వేల వరకు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. నేటి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. LG గరిష్ఠంగా టీవీల ధరలను రూ.85వేల వరకు తగ్గించినట్లు తెలిపింది. సోనీలో రూ.70వేల వరకు, పానాసోనిక్‌లోనూ మోడల్‌ను బట్టి రూ.7వేల వరకు తగ్గించినట్లు వెల్లడించాయి. టూవీలర్స్‌లో రూ.18వేలు, కార్ల ధరలను రూ.4.48 లక్షల వరకు తగ్గించినట్లు ఆయా కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి.

Similar News

News September 22, 2025

రాష్ట్రానికి మరో రెండు వందేభారత్ రైళ్లు

image

TG: రాష్ట్రానికి మరో రెండు వందేభారత్ రైళ్లు మంజూరయ్యాయి. చర్లపల్లి-నాందేడ్, నాంపల్లి-పుణే మధ్య ఇవి రాకపోకలు సాగించనున్నాయి. త్వరలోనే ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా విశాఖకు రెండు, తిరుపతి, బెంగళూరు, నాగపూర్‌కి ఒకటి చొప్పున 5 రైళ్లు నడుస్తుండగా.. కొత్తగా రెండు సర్వీసులు యాడ్ కానున్నాయి.

News September 22, 2025

రాష్ట్రంలో 1623 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్

image

<>తెలంగాణ<<>> వైద్యారోగ్యశాఖలో 1623 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ , మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి. పీజీ/DNB/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 46ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వెబ్‌సైట్: https://cass.tgmhsrb.in/

News September 22, 2025

కనకదుర్గమ్మ చెంత 300 ఏళ్ల రావి చెట్టు

image

AP: విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో 300 ఏళ్ల రావి చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రోజూ వేలాది మంది భక్తులు అమ్మవారితోపాటు ఈ వృక్షానికి దండం పెట్టుకుని వెళతారు. సాధారణంగా హిందువులు రావి చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ వృక్షం దుర్గమ్మ చెంత ఉండటంతో విశిష్ఠత సంతరించుకుంది. కాగా ఇవాళ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు మొదలయ్యాయి.