News September 22, 2025
నేటి నుంచి తగ్గనున్న విశాఖ డెయిరీ పాల ధరలు

ఇటీవల సవరించిన జీఎస్టి రేట్లతో పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయని విశాఖ డెయిరీ యాజమాన్యం ప్రకటించింది. ఈ కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. విశాఖ డెయిరీలో మొత్తం 188 ఉత్పత్తుల్లో 94 ఉత్పత్తుల గరిష్ఠ అమ్మక ధరలు తగ్గనున్నాయి. పాలు లీటరుకు రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గనుంది. పనీర్ కేజీ ప్యాకెట్ ధర రూ.20, నెయ్యి కేజీకి రూ.42, బట్టర్ రూ.40 వరకు తగ్గనున్నాయి.
Similar News
News September 22, 2025
రాష్ట్రానికి మరో రెండు వందేభారత్ రైళ్లు

TG: రాష్ట్రానికి మరో రెండు వందేభారత్ రైళ్లు మంజూరయ్యాయి. చర్లపల్లి-నాందేడ్, నాంపల్లి-పుణే మధ్య ఇవి రాకపోకలు సాగించనున్నాయి. త్వరలోనే ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా విశాఖకు రెండు, తిరుపతి, బెంగళూరు, నాగపూర్‌కి ఒకటి చొప్పున 5 రైళ్లు నడుస్తుండగా.. కొత్తగా రెండు సర్వీసులు యాడ్ కానున్నాయి.
News September 22, 2025
రాష్ట్రంలో 1623 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్

<
News September 22, 2025
ఖమ్మం: నిరీక్షణలో 95,325 మంది నిరుద్యోగులు

నిరుద్యోగ యువతను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో జాప్యం చేస్తోందని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. జిల్లాలో దరఖాస్తు చేసుకున్న 95,325 మంది లబ్ధిదారులు పథకం ఎప్పుడు అమలు చేస్తారో తెలియక సందిగ్ధంలో ఉన్నారు. అధికారులు వెంటనే స్పందించి, పథకం అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు.