News September 22, 2025

అటుకుల బతుకమ్మ ఎలా జరపాలి?

image

బతుకమ్మ పండుగలో రెండో రోజును ‘అటుకుల బతుకమ్మ’ అని అంటారు. ఈ రోజున బతుకమ్మను గునుగు, తంగేడు, నందివర్ధనం, బంతి, చామంతి, గుమ్మడి, బీర పూలతో పేర్చి, వాటిపై గౌరీ దేవిని ప్రతిష్ఠించాలి. అటుకులు, బెల్లం, చప్పిడి పప్పులను నైవేద్యంగా సమర్పించి, వాటిని పిల్లలకు పంచిపెట్టాలి. ఈ నైవేద్యం పిల్లలకు ఇష్టం కాబట్టే ఈ రోజుకు ‘అటుకుల బతుకమ్మ’ అనే పేరు వచ్చిందని నమ్మకం. ఈరోజే దేవి నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి.

Similar News

News September 22, 2025

రాష్ట్రానికి మరో రెండు వందేభారత్ రైళ్లు

image

TG: రాష్ట్రానికి మరో రెండు వందేభారత్ రైళ్లు మంజూరయ్యాయి. చర్లపల్లి-నాందేడ్, నాంపల్లి-పుణే మధ్య ఇవి రాకపోకలు సాగించనున్నాయి. త్వరలోనే ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా విశాఖకు రెండు, తిరుపతి, బెంగళూరు, నాగపూర్‌కి ఒకటి చొప్పున 5 రైళ్లు నడుస్తుండగా.. కొత్తగా రెండు సర్వీసులు యాడ్ కానున్నాయి.

News September 22, 2025

రాష్ట్రంలో 1623 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్

image

<>తెలంగాణ<<>> వైద్యారోగ్యశాఖలో 1623 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ , మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి. పీజీ/DNB/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 46ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వెబ్‌సైట్: https://cass.tgmhsrb.in/

News September 22, 2025

కనకదుర్గమ్మ చెంత 300 ఏళ్ల రావి చెట్టు

image

AP: విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో 300 ఏళ్ల రావి చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రోజూ వేలాది మంది భక్తులు అమ్మవారితోపాటు ఈ వృక్షానికి దండం పెట్టుకుని వెళతారు. సాధారణంగా హిందువులు రావి చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ వృక్షం దుర్గమ్మ చెంత ఉండటంతో విశిష్ఠత సంతరించుకుంది. కాగా ఇవాళ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు మొదలయ్యాయి.