News September 22, 2025
జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి: దుర్గేశ్

జమిలీ ఎన్నికలు సహృద్భావ వాతావరణంలో జరగాలని, ఈ అంశంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ అవసరమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. రాజమండ్రి మంజీరా హోటల్లో “వన్ నేషన్-వన్ ఎలక్షన్”కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాలకు ఎన్నికల వ్యయం తగ్గుతుందన్నారు. ప్రజాస్వామ్యం బలపడటంతో పాటు సమగ్రాభివృద్ధి కోసం ఇది విప్లవాత్మక సంస్కరణ అన్నారు.
Similar News
News September 22, 2025
రాజమండ్రి: హ్యాండ్‌కఫ్స్‌తో ఖైదీ పరార్

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ కోర్టుకు తీసుకెళ్లి తిరిగి తీసుకువస్తున్న సమయంలో బత్తుల ప్రభాకర్ అనే ఖైదీ తప్పించుకున్నట్లు పోలీసుల తెలిపారు. సోమవారం రాత్రి దేవరపల్లి మండలం దుద్దుకూరు సమీపంలో వాహనం ఆపగా అతడు పరారయ్యాడని పేర్కొన్నారు. తప్పించుకునే సమయంలో నిందితుడి చేతులకు హ్యాండ్‌కఫ్స్ ఉన్నట్లు తెలిపారు. వివరాలు తెలిసినవారు 94407 96584 నంబరుకు సమాచారం ఇవ్వాలని సీఐ నాయక్ కోరారు.
News September 22, 2025
4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం: కలెక్టర్

ఈ ఖరీఫ్ సీజన్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై జరిగిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సీజన్‌లో మొత్తం 5.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. అందులో 4 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వమే కొనుగోలు చేయనుందని తెలిపారు.
News September 22, 2025
నన్నయ యూనివర్సిటీ, నాందీ ఫౌండేషన్‌ల మధ్య ఒప్పందం

ఆదికవి నన్నయ యూనివర్సిటీ – నాందీ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సోమవారం యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.వి స్వామి, నాందీ ఫౌండేషన్ రీజనల్ మేనేజర్ శ్రీలక్ష్మి ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేసి పత్రాలు మార్చుకున్నారు. నాందీ ఫౌండేషన్‌తో ఎంఓయూ చేసుకున్న తొలి వర్సిటీ గా ‘నన్నయ’ వర్సిటీ నిలుస్తుందన్నారు.