News September 22, 2025
కృష్ణా: నేడు బాలా త్రిపుర సుందరిగా దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ

శరన్నవరాత్రులలో తొలి రోజైన నేడు సోమవారం బాలా త్రిపురసుందరి దేవిగా విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం బాలాత్రిపురసుందరీదేవి అని, ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగుతాయని, సర్వ సంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. మహిమాన్వితమైన శ్రీ బాలా మంత్రం సమస్త దేవీమంత్రాల్లోకెల్లా అత్యున్నతమైనదని ఉపాసకులు చెబుతారు.
Similar News
News September 22, 2025
ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ నం.1

ఆయిల్ పామ్ సాగులో TG దేశంలోనే నం.1 స్థానంలో నిలిచింది. దీని సాగు పెంచేలా 2021 నుంచి ఐదేళ్లకు గానూ కేంద్రం 9 రాష్ట్రాలకు 3.22 లక్షల హెక్టార్ల లక్ష్యం నిర్దేశించింది. తమకు నిర్దేశించిన 1.25 లక్షల హెక్టార్లలో 78,869 హెక్టార్లు సాగు చేసి TG ముందులో నిలిచింది. AP 67,727 హెక్టార్లు, ఒడిశా 4946, KA 5088 హెక్టార్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగతా లక్ష్యం త్వరలో చేరుకుంటామని TG మంత్రి తుమ్మల తెలిపారు.
News September 22, 2025
HYD: డాగ్ అడాప్షన్‌కు ముందే వ్యాక్సినేషన్

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దేశీ పప్పీ డాగ్ అడాప్షన్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా KBR పార్కులో నిర్వహించిన రెండోసారి, 16 కుక్క పిల్లలను కుక్క పిల్లల ప్రేమికులకు అందజేసినట్లుగా తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అందించే ఈ కుక్క పిల్లలకు వ్యాక్సినేషన్ అందించడంతో పాటు, స్టెరిలైజేషన్ ముందే చేసి ఇస్తున్నట్లుగా వివరించారు.
News September 22, 2025
బండారు సూచనలపై స్పందించిన స్పీకర్

నాన్ షెడ్యూల్ ఏరియాలో గిరిజనులకు న్యాయం చేయాలని ప్రస్తావిస్తు బండారు సత్యనారాయణమూర్తి చేసిన సూచనలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. నాన్ షెడ్యూల్ ఏరియాలో గిరిజనులకు న్యాయం జరిగే విధంగా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి త్వరితగతిన పంపించాలని సంబంధిత మంత్రి, అధికారులను స్పీకర్ ఆదేశించారు. ఈ విషయంలో జాప్యం చేయవద్దన్నారు.