News September 22, 2025

నేటి నుంచి కొత్తమ్మ తల్లి జాతర.. వెనుకున్న కథ ఇదే..!

image

కొత్తమ్మ తల్లి జాతర ప్రారంభం కానుంది. దీని వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.1925లో కోటబొమ్మాళికి చెందిన చిన్నప్పలనాయుడు ఎడ్లబండిపై నారాయణవలస సంత నుంచి వస్తుండగా ఓ ముసలి ముత్తైదువు బండెక్కింది. కోటబొమ్మాళికి చేరాక గజ్జల శబ్ధంతో అదృశ్యమైంది. ఆ రాత్రి కలలో “నేనే కొత్తమ్మతల్లి, పట్నాయకుని వెంకటేశ్వరరావు తోటలో ఆలయాన్ని కట్టండి. ఏటా పోలాల అమావాస్య తర్వాత ఉత్సవాలు జరపండి” అని చెప్పినట్లు సమాచారం.

Similar News

News September 23, 2025

శ్రీకాకుళం: లుక్ ఎట్ టుడే టాప్ న్యూస్

image

✦ DSCలో ఎంపికైన అభ్యర్థులకు డీఈఓ ముఖ్య సూచనలు
✦రాష్ట్ర పండుగ కొత్తమ్మతల్లి ఉత్సవాలకు సర్వం సిద్ధం
✦నందిగాం: ఈఎంఐ కట్టలేదని ఇంటికి తాళం వేశారు
✦శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 63 అర్జీలు
✦జిల్లా వ్యాప్తంగా ప్రారంభం అయిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
✦శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు
✦ గుంతలమయంగా మారిన కొత్తపేట జంక్షన్ రోడ్డు

News September 22, 2025

శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 63 అర్జీల స్వీకరణ

image

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 63 ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.

News September 22, 2025

కోటబొమ్మాళి: హెలికాఫ్టర్ రైడ్‌కు వెళ్తున్నారా.. ఇది గమనించండి

image

కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన హెలికాఫ్టర్ రైడ్‌కు వెళ్తున్నారా? అయితే ఇది గమనించాలని నిర్వాహకులు చెబుతున్నారు. రైడ్ టికెట్ రూ.2 వేలుగా నిర్ణయించారు. టికెట్ కావాల్సిన వారు కేవలం క్యాష్ మాత్రమే తీసుకురావాలని, యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ చెల్లవని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ సుధాకర్ తెలిపారు. పర్యాటకులు గమనించాలని ఆయన కోరారు.