News September 22, 2025

ఒంగోలు: నేటి నుంచి డిగ్రీ కాలేజీల బంద్

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలు నేటి నుంచి నిరవధిక బంద్‌కు సిద్ధమయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల జాప్యంపై యాజమాన్యాలు బంద్‌ను ప్రకటించాయి. సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేశామని డిగ్రీ కళాశాల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాంబాబు తెలిపారు. ప్రభుత్వం స్పందించాలని కోరారు.

Similar News

News September 22, 2025

ప్రకాశం: ఇంటర్ కాలేజీలకు RIO వార్నింగ్

image

ప్రకాశం జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని RIO ఆంజనేయులు అన్నారు. కలెక్టరేట్ వద్ద సర్టిఫికెట్ల కోసం నిరసన తెలిపిన విద్యార్థినికి సంబంధిత కళాశాల యాజమాన్యంతో మాట్లాడి సర్టిఫికెట్లు అందించారని చెప్పారు. ఇలాంటి చర్యలకు ఏ కళాశాల పాల్పడినా శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News September 22, 2025

1100 నంబర్ సేవ్ చేసుకోండి: ప్రకాశం కలెక్టర్

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీదారులు 1100 నంబర్‌పై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. కలెక్టర్ మీకోసం కార్యక్రమంలో సమర్పించిన అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు అర్జీదారులు కాల్ చేయవచ్చని ఆయన తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో మీకోసం కార్యక్రమం సాగుతుందని తెలిపారు.

News September 21, 2025

ప్రకాశంకు ఆరెంజ్ అలర్ట్.. 3 గంటల్లో భారీ వర్షాలు.!

image

ప్రకాశం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం ప్రకటన జారీచేసింది. రాబోయే మూడు గంటల్లో భారీ తుఫానుతోపాటు, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు ప్రకటించారు. ప్రజలు హోర్డింగుల వద్ద ఉండరాదని, అలాగే శిథిలావస్థకు చేరిన భవనాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. మూడు గంటలపాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు వారు తెలిపారు.