News September 22, 2025

NLG: సమృద్ధిగా వర్షాలు.. చేప పిల్లల పంపిణీలో జాప్యం

image

ఈ ఏడాది జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలు నిండుగా ఉన్నాయి.. చేప పిల్లల పంపిణీకి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పంపిణీ ఆలస్యమవుతోంది. దీంతో మత్స్యకార్మిక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. జిల్లాలో మొత్తం 260 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. అయితే, ఉచిత చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వల్ల టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది.

Similar News

News September 22, 2025

వేరుశనగలో ముదురు ఆకుమచ్చ తెగులు లక్షణాలు

image

వేరుశనగలో ముదురు ఆకుమచ్చ తెగులు పంట నాటిన 25 నుంచి 35 రోజుల తర్వాత ఎప్పుడైనా ఆశించవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గడం, ఆకులపై మంచు ఉండటం, అధిక వర్షం, అధిక నత్రజని వాడకం, మెగ్నీషియం లోపం ఈ తెగులు వ్యాప్తికి కారణమవుతుంది. ఈ తెగులు వల్ల ఆకుల అడుగు భాగం, కాండం, ఊడలపైనా ముదురు రంగులో గుండ్రని మచ్చలు కనిపిస్తాయి. తర్వాత దశలో ఈ మచ్చలు అన్నీ ఒక దానితో ఒకటి కలిసిపోయి ఆకులు పండుబారి రాలిపోతాయి.

News September 22, 2025

బాలా త్రిపుర సుందరి దేవిగా ఉజ్జయిని మహాకాళి

image

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ప్రారంభించారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థమై అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు.

News September 22, 2025

RRRపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష

image

సచివాలయంలో RRRపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. RRR ఉత్తర భాగం టెండర్లు, దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ ఆమోదం అంశాలపై రివ్యూ నిర్వహించారు. భూసేకరణ, పరిహారం, అలైన్‌మెంట్ మార్పులపై చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలో ఆర్&బీ ఉన్నతాధికారులు, RRR ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.