News September 22, 2025
JGTL: 1,700 కిలోల పూలు.. 16 అడుగుల ఎత్తు..!

రాష్ట్రంలో నిమజ్జనం చేసే అతిపెద్ద బతుకమ్మ జగిత్యాల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే బతుకమ్మ. 2016లో 10.5 అడుగుల వెడల్పు, 16 అడుగుల ఎత్తుతో 1,700 KGల పూలతో తయారుచేసిన బతుకమ్మ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఇక అప్పట్నుంచి ఏటా మహా బతుకమ్మ పేరుతో అదే రీతిలో బతుకమ్మను పేరుస్తూ ఘనంగా సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Similar News
News September 22, 2025
బాలా త్రిపుర సుందరి దేవిగా ఉజ్జయిని మహాకాళి

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ప్రారంభించారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థమై అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు.
News September 22, 2025
RRRపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష

సచివాలయంలో RRRపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. RRR ఉత్తర భాగం టెండర్లు, దక్షిణ భాగం అలైన్‌మెంట్ ఆమోదం అంశాలపై రివ్యూ నిర్వహించారు. భూసేకరణ, పరిహారం, అలైన్‌మెంట్ మార్పులపై చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలో ఆర్&బీ ఉన్నతాధికారులు, RRR ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
News September 22, 2025
GWL: హోంగార్డులకు రెయిన్ కోట్ల అందజేత

గద్వాల జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న హోంగార్డులకు ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రెయిన్ కోట్లు, ఉలన్ జాకెట్లు అందజేశారు. పోలీసులతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని డీజీపీ కార్యాలయం నుంచి రైన్ కోట్లు పంపిణీ చేశారని తెలిపారు. హోంగార్డులకు ఎలాంటి సమస్యలు తలెత్తిన తనను సంప్రదించాలన్నారు. AR DSP నరేంద్ర రావు పాల్గొన్నారు.