News September 22, 2025
వనపర్తి: రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

వనపర్తి జిల్లాలో ఇటీవల విద్యుత్ ప్రమాదాల్లో 11 మంది రైతులు చనిపోయిన నేపథ్యంలో, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. తడి నేలల్లో విద్యుత్ మోటార్లను ఆన్, ఆఫ్ చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. విద్యుత్ లైన్లలో ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే లైన్‌మెన్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా రైతులు రబ్బరు చెప్పులు ధరించాలని ఎస్పీ కోరారు.
Similar News
News September 22, 2025
దేశానికి సింగరేణి వెలుగులు అందిస్తోంది: CM

తెలంగాణ ఏర్పాటులో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ అన్నారు. ‘సింగరేణి బొగ్గు గనులు దేశానికి వెలుగులు అందిస్తున్నాయి. సంస్థకు వచ్చే లాభాలను కార్మికులకు పంచుతున్నాం. దేశంలోనే తొలిసారిగా ఒప్పంద కార్మికులకు కూడా గతేడాది రూ.5 వేల బోనస్ ఇచ్చాం. ఈసారి ఆ మొత్తాన్ని పెంచి రూ.5,500 ఇస్తున్నాం. ప్రైవేట్‌కు అప్పగించిన గనుల టెండర్లను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని స్పష్టం చేశారు.
News September 22, 2025
ధర్వేశిపురం ఎల్లమ్మ తల్లి దివ్య దర్శనం

కనగల్ మండలం ధర్వేశిపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో సోమవారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి మాట్లాడుతూ.. అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారి అంబటి నాగిరెడ్డి, ఛైర్మన్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
News September 22, 2025
నెల్లూరు: మద్దతు ధర లేక రైతుల కష్టాలు!

జిల్లాలోని వరి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. మిల్లర్లు, దళారులు కనీస మద్దతు ధర కంటే తక్కువగా, పుట్టి రూ.15 వేలకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎకరాకు రూ.16,520 నష్టం వాటిల్లుతోంది. వర్షాల కారణంగా ధాన్యం రంగు మారిందని సాకుతో రేట్లు తగ్గిస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు దోపిడీకి గురవుతున్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా జోక్యం చేసుకోవాలంటున్నారు.