News April 5, 2024

శ్రీకాకుళంలో భానుడి భగ భగ

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భానుడు భగభగమంటూ నిప్పులు చెరుగుతున్నాడు. ఎండతీవ్రతకు పట్టణంతో పాటుగా ఆమదాలవలస, రణస్థలం, ఎచ్చెర్ల, చిలకపాలెం, టెక్కలి, రాజాం, పొందూరు ప్రధాన రహదారులపై జనసంచారం పలుచబడింది. ఎండ వేడిమికి వృద్ధులు, పిల్లలు, వాహనదారులు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News April 2, 2025

శ్రీకాకుళం: ముగిసిన టెన్త్ క్లాస్ పరీక్షలు..151 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో టెన్త్ క్లాస్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. 151 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ తిరుమల చైతన్య తెలిపారు. రెగ్యులర్‌ విద్యార్థులు 129 మంది, 22 మంది ప్రైవేట్‌ విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు. జిల్లాలో పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు.

News April 1, 2025

శ్రీకాకుళం: ఏపీ పీజీఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్

image

రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీఈసెట్ నోటిఫికేషన్ మార్చి 28వ తేదీన విడుదలైంది. ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దాదాపు 153 పీజీ కోర్సులకు సంబంధించి జూన్ 6 నుంచి 8 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు https://cets .apsche.ap.gov.inలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

News April 1, 2025

SKLM: హెడ్ కానిస్టేబుల్‌ను సత్కరించిన జిల్లా ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో సుమారు 41సంవత్సరాలు పాటు హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసిన పి. కృష్ణమూర్తి మార్చి 31న (సోమవారం) ఉద్యోగ విరమణ చెందారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కృష్ణమూర్తికి శాలువా, పూల దండతో సత్కరించారు. అనంతరం జ్ఞాపిక‌ను ప్రధానం చేసి పోలీస్ అధికారుల సమక్షంలో ఆత్మీయ వీడ్కోలు పలికారు.

error: Content is protected !!