News September 22, 2025
రాష్ట్ర ఉత్సవంగా గురజాడ జయంతి: కొండపల్లి

AP:సమాజంలోని దురాచారాలను తన రచనలతో మార్చిన మహాకవి గురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. 150 ఏళ్లైనా ఆయన రచనలు, సాహిత్యం ఇంకా ప్రజాదరణ పొందుతున్నాయని తెలిపారు. గురజాడ జయంతి సందర్భంగా VZMలో ఆయన ఇంటిని సందర్శించిన మంత్రి, MP కలిశెట్టి దాని ఆధునికీకరణ, గ్రంథాలయ నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించారు.
Similar News
News September 22, 2025
రాష్ట్రంలో 42 పోస్టులు.. దరఖాస్తుల సవరణకు కొన్ని గంటలే ఛాన్స్

<
News September 22, 2025
భర్తలను కాపాడుకున్న భార్యలు!

భర్త ప్రాణాల్ని కాపాడుకొనేందుకు భార్య చూపే ప్రేమ, త్యాగాలకు సరిహద్దులు లేవని ఈ ఘటన మరోసారి నిరూపించింది. నవీ ముంబైలో ప్రాణాంతక వ్యాధితో ఇద్దరు భర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆపరేషన్ చేద్దామంటే కుటుంబీకుల రక్తం మ్యాచ్ అవ్వకపోవడంతో ఒకరి భర్త కోసం మరొకరు లివర్‌ను దానం చేసి వారి ప్రాణాలు కాపాడారు. ఆపరేషన్ విజయవంతమై నలుగురూ క్షేమంగా ఉన్నారు. భార్యల త్యాగాన్ని నెటిజన్లు ప్రశంసింస్తున్నారు.
News September 22, 2025
అందంగా.. ఆపదలో రక్షణగా!

పనుల కోసం బయటికెళ్లే యువతులు, మహిళల స్వీయ రక్షణ కోసం కొత్త తరహా వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. క్యాట్ ఇయర్ కీచైన్లు లేదా కిట్టి నకిల్స్ లేదా సెల్ఫ్ డిఫెన్స్ కీ చైన్ల పేరుతో ఆన్‌లైన్‌లో లభిస్తాయి. అందంగా ఉండే వీటిని కార్, స్కూటీ కీలకు, బ్యాగ్‌లు, పర్సులకు పెట్టుకోవచ్చు. అత్యవసర సమయాల్లో వీటి రంధ్రాల్లో వేళ్లని పెట్టి గ్రిప్ తెచ్చుకుని అవతలి వ్యక్తిని ప్రతిఘటించవచ్చు.
#ShareIt