News September 22, 2025
కోటబొమ్మాళి: జాతరలో హెలికాఫ్టర్ రైడ్ టికెట్ రూ. 2 వేలు

కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మ తల్లి జాతరలో హెలికాఫ్టర్ రైడ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దానికి టికెట్ రూ.2వేలుగా అధికారులు నిర్ణయించారు. అమ్మకాలు సోమవారం నుంచి ప్రారంభించారు. రోజుకు 40 టికెట్లు అమ్మకాలు జరుపుతారు. 23-25వ తేదీలలో రైడుకు సంబంధించిన టికెట్లు వంశధార కాలేజీ వద్ద విక్రయిస్తారు. వాతావరణం పరిస్థితులు బట్టి, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రిప్పులు ఉంటాయని అధికారులు తెలిపారు.
Similar News
News September 23, 2025
శ్రీకాకుళం: లుక్ ఎట్ టుడే టాప్ న్యూస్

✦ DSCలో ఎంపికైన అభ్యర్థులకు డీఈఓ ముఖ్య సూచనలు
✦రాష్ట్ర పండుగ కొత్తమ్మతల్లి ఉత్సవాలకు సర్వం సిద్ధం
✦నందిగాం: ఈఎంఐ కట్టలేదని ఇంటికి తాళం వేశారు
✦శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 63 అర్జీలు
✦జిల్లా వ్యాప్తంగా ప్రారంభం అయిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
✦శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు
✦ గుంతలమయంగా మారిన కొత్తపేట జంక్షన్ రోడ్డు
News September 22, 2025
శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 63 అర్జీల స్వీకరణ

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 63 ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
News September 22, 2025
కోటబొమ్మాళి: హెలికాఫ్టర్ రైడ్‌కు వెళ్తున్నారా.. ఇది గమనించండి

కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన హెలికాఫ్టర్ రైడ్‌కు వెళ్తున్నారా? అయితే ఇది గమనించాలని నిర్వాహకులు చెబుతున్నారు. రైడ్ టికెట్ రూ.2 వేలుగా నిర్ణయించారు. టికెట్ కావాల్సిన వారు కేవలం క్యాష్ మాత్రమే తీసుకురావాలని, యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ చెల్లవని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ సుధాకర్ తెలిపారు. పర్యాటకులు గమనించాలని ఆయన కోరారు.