News September 22, 2025
KNR: రోడ్డు ప్రమాదం.. హోటల్లోకి దూసుకెళ్లిన లారీ

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి KNRవైపు వెళ్తున్న ఓ లారీ తాడికల్ గ్రామ పోస్ట్ ఆఫీస్ వద్ద జాతీయ రహదారిపై ఉన్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టి పక్కనే ఉన్న ఓ చిన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ మహిళ గాయపడగా మరో మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. లారీ పాక్షికంగా దెబ్బతింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 22, 2025
JGTL: దసరా బొనాంజా పేరుతో వింత ఆఫర్లు

జగిత్యాల జిల్లాలో దసరా పండుగ సందర్భంగా ‘దసరా బొనాంజా’ పేరుతో కొందరు యువకులు రూ.150కే మేక, బీర్లు, విస్కీ, కోళ్లు, చీర వంటి బహుమతులు ప్రకటించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ఆఫర్లకు సంబంధించిన ఫ్లెక్సీలు వైరల్‌గా మారాయి. స్థానికంగా సాయిని తిరుపతి అనే వ్యక్తి ఈ బంపర్ డ్రాను నిర్వహిస్తున్నట్లు సమాచారం. OCT 1న డ్రా తీయనున్నారని ప్రచారం జరుగుతుండటంతో ప్రజలు టోకెన్లకు ఎగబడుతున్నారు.
News September 22, 2025
తాండూరులో గర్భిణీ మృతి

తాండూరు ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. కొడంగల్ నియోజకవర్గం రావులపల్లి గ్రామానికి చెందిన అఖిల(21) రెండవ కాన్పు కోసం ఆసుపత్రిలో చేరి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
News September 22, 2025
జగిత్యాల: క్రీడలతో పోటీ భావన పెరుగుతుంది: SP

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రికెట్ & బ్యాట్మెంటన్ పోటీల్లో విజేతలుగా నిలిచిన పోలీస్ టీం సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మన శారీరక ఆరోగ్యానికి బలాన్ని అందించడమే కాకుండా, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. క్రీడలతో మనలో పోటీ భావన పెరుగుతుందని, అలాగే సహచరులను ప్రోత్సహించే స్ఫూర్తి కూడా వస్తుందని పేర్కొన్నారు.