News September 22, 2025
కొమురవెల్లి: ప్రేమ విఫలం యువకుడి ఆత్మహత్య

ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందని పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొమురవెల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. గౌరాయిపల్లికి చెందిన పెద్ది మధుసూదన్ రెడ్డి(23) గత కొంతకాలంగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. యువతి ఇంట్లో ప్రేమ విషయం తెలవడంతో యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్థాపానికి గురై పురుగు మందు తాగి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.
Similar News
News September 22, 2025
బాపట్లలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బాపట్ల జిల్లాలో కురిసే భారీవర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. వినోద్ కుమార్ సోమవారం సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇది 24 గంటలు పనిచేస్తుందన్నారు. ఆపద సమయంలో కాల్ 97110 77372కు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లా అత్యవసర ఆపరేషన్ కేంద్రం 1077, రాష్ట్ర కేంద్రం 1070 టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచామన్నారు.
News September 22, 2025
నవరాత్రి ఉత్సవాలు.. ఉపవాసం ఉంటున్నారా?

నవరాత్రుల సందర్భంగా వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే సరైన జాగ్రత్తలు పాటించకపోతే త్వరగా అలసిపోవడం, తల తిరగడం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండ్లు తినడం, రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగడం, ఫైబర్, ప్రొటీన్, ఆహారంలో కార్బోహైడ్రేట్స్ సమపాళ్లలో ఉండేలా చూసుకోవడం వంటి చిట్కాల ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు.
News September 22, 2025
VJA: దసరా ఉత్సవ సేవా కమిటీ ఏర్పాటు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల సందర్బంగా భక్తులకు సేవలందించే సేవా కమిటీ సభ్యులను నియమించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి మొత్తం 96 మందిని ఎంపిక చేశారు. వీరు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 02వ తేదీ వరకు అమ్మవారి ఆలయం వద్ద ఉండి భక్తులకు అవసరమైన సేవలను అందిస్తారని ఎండోమెంట్ కమిషనర్ కె.రామచంద్రమోహన్ తెలిపారు. ఈ మేరకు సేవా కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ఐడీ కార్డులను అందజేయనున్నారు.