News September 22, 2025

బండారు సూచనలపై స్పందించిన స్పీకర్

image

నాన్ షెడ్యూల్ ఏరియాలో గిరిజనులకు న్యాయం చేయాలని ప్రస్తావిస్తు బండారు సత్యనారాయణమూర్తి చేసిన సూచనలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. నాన్ షెడ్యూల్ ఏరియాలో గిరిజనులకు న్యాయం జరిగే విధంగా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి త్వరితగతిన పంపించాలని సంబంధిత మంత్రి, అధికారులను స్పీకర్ ఆదేశించారు. ఈ విషయంలో జాప్యం చేయవద్దన్నారు.

Similar News

News September 22, 2025

రైల్‌నీర్ వాటర్ బాటిల్ @రూ.14

image

GST శ్లాబుల సవరణలతో ఇవాళ్టి నుంచి రైళ్లలో లభించే రైల్‌నీర్ వాటర్ బాటిల్ ధరను రైల్వే శాఖ తగ్గించింది. ఇప్పటివరకూ 1L బాటిల్‌పై రూ.15గా ఉన్న ధర రూ.14కు తగ్గింది. అలాగే గతంలో రూ.10గా ఉన్న 500 మి.లీ. బాటిల్ ₹9కే లభించనుంది. అయితే ఎక్కువ ధరలకు విక్రయిస్తే 139కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ప్రతి రూపాయి ముఖ్యమే కాబట్టి తగ్గిన ధరలను గమనించి చిల్లరను అడిగి తీసుకోండి. SHARE IT

News September 22, 2025

NIRDPRలో ఉద్యోగాలు

image

HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్‌‌(<>NIRDPR<<>>) ప్రాజెక్ట్ సైంటిస్ట్(2), జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్(3) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంటెక్, MSc(జియో ఇన్ఫర్మేటిక్స్, రిమోట్ సెన్సింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు OCT 3వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News September 22, 2025

బాపట్లలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బాపట్ల జిల్లాలో కురిసే భారీవర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. వినోద్ కుమార్ సోమవారం సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇది 24 గంటలు పనిచేస్తుందన్నారు. ఆపద సమయంలో కాల్ 97110 77372కు ఫోన్‌ చేయాలని సూచించారు. జిల్లా అత్యవసర ఆపరేషన్ కేంద్రం 1077, రాష్ట్ర కేంద్రం 1070 టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచామన్నారు.