News September 22, 2025
ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ నం.1

ఆయిల్ పామ్ సాగులో TG దేశంలోనే నం.1 స్థానంలో నిలిచింది. దీని సాగు పెంచేలా 2021 నుంచి ఐదేళ్లకు గానూ కేంద్రం 9 రాష్ట్రాలకు 3.22 లక్షల హెక్టార్ల లక్ష్యం నిర్దేశించింది. తమకు నిర్దేశించిన 1.25 లక్షల హెక్టార్లలో 78,869 హెక్టార్లు సాగు చేసి TG ముందులో నిలిచింది. AP 67,727 హెక్టార్లు, ఒడిశా 4946, KA 5088 హెక్టార్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగతా లక్ష్యం త్వరలో చేరుకుంటామని TG మంత్రి తుమ్మల తెలిపారు.
Similar News
News September 22, 2025
రైల్‌నీర్ వాటర్ బాటిల్ @రూ.14

GST శ్లాబుల సవరణలతో ఇవాళ్టి నుంచి రైళ్లలో లభించే రైల్‌నీర్ వాటర్ బాటిల్ ధరను రైల్వే శాఖ తగ్గించింది. ఇప్పటివరకూ 1L బాటిల్‌పై రూ.15గా ఉన్న ధర రూ.14కు తగ్గింది. అలాగే గతంలో రూ.10గా ఉన్న 500 మి.లీ. బాటిల్ ₹9కే లభించనుంది. అయితే ఎక్కువ ధరలకు విక్రయిస్తే 139కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ప్రతి రూపాయి ముఖ్యమే కాబట్టి తగ్గిన ధరలను గమనించి చిల్లరను అడిగి తీసుకోండి. SHARE IT
News September 22, 2025
NIRDPRలో ఉద్యోగాలు

HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(<
News September 22, 2025
నవరాత్రి ఉత్సవాలు.. ఉపవాసం ఉంటున్నారా?

నవరాత్రుల సందర్భంగా వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే సరైన జాగ్రత్తలు పాటించకపోతే త్వరగా అలసిపోవడం, తల తిరగడం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండ్లు తినడం, రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగడం, ఫైబర్, ప్రొటీన్, ఆహారంలో కార్బోహైడ్రేట్స్ సమపాళ్లలో ఉండేలా చూసుకోవడం వంటి చిట్కాల ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు.