News September 22, 2025

అర్జీలను స్వీకరించిన కలెక్టర్ ఆనంద్

image

అనంతపురంలోని కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తీసుకున్న అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News September 28, 2025

ధన్, ధాన్య కృషి యోజనలో అనంతపురం జిల్లా ఎంపిక

image

PM ధన్, ధాన్య కృషి యోజన కింద దేశంలోని 100 ఆశావహ వ్యవసాయ జిల్లాల్లో అనంతపురం ఎంపికైనట్లు MP అంబికా లక్ష్మీనారాయణ ఆదివారం తెలిపారు. PM మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌, CM చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు పంట ఉత్పాదకత తక్కువగా ఉండడం, తక్షణ రుణాల పంపిణీ పరిమితంగా ఉండడం వంటివి ఆధారంగా తీసుకున్న నిర్ణయం మంచిపరిణామమన్నారు.

News September 28, 2025

అనంతపురం జిల్లాలో పింఛన్లకు రూ.124.77 కోట్లు మంజూరు

image

అక్టోబర్ 1న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అనంతపురం జిల్లాలో 2,79,933 మంది లబ్ధిదారులకు రూ.124.7 కోట్లు మంజూరు చేశారు. సచివాలయం సిబ్బంది ఉదయం 7 గంటలకు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సొమ్ము అందజేయనున్నారు. అక్టోబర్ 2 సెలవు కారణంగా మొదటి రోజు పొందని వారు అక్టోబర్ 3న సచివాలయాలలో పెన్షన్ తీసుకోవచ్చని DRDA పీడీ శైలజ తెలిపారు.

News September 28, 2025

‘తాడిపత్రిలో 23 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు’

image

తాడిపత్రిలో ఆ మిత్రులందరూ 23 ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకున్నారు. దాదాపు 30 మంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి డాక్టర్లు, జడ్జి, టీచర్స్, ASPలుగా ఉన్నత పదవుల్లో ఉన్నారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత తమ గురువులతో కలిసి మిత్రులతో సంతోషంగా గడపడం ఎంతో సంతోషంగా ఉందని కరస్పాండెంట్ సిస్టర్ సెలీన్ పేర్కొన్నారు.