News September 22, 2025
ప్రభాకర్‌రావు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, మాజీ IPS ప్రభాకర్‌రావు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు OCT 8కి వాయిదా వేసింది. ప్రభాకర్‌రావు సిట్ దర్యాప్తుకు సహకరించడం లేదని, జర్నలిస్టులు, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో విచారణకు సహకరించాలని కోర్టు ప్రభాకర్‌రావును ఆదేశించింది. 2 వారాల గడువు కావాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరడంతో విచారణ వాయిదా వేసింది.
Similar News
News September 22, 2025
GST సంస్కరణలతో సామాన్యులకు మేలు: జగన్

AP: GST సంస్కరణల తుది ప్రయోజనాలు వినియోగదారులకు అందుతాయని ఆశిస్తున్నట్లు మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. ‘ఇది సరళమైన, న్యాయమైన పన్ను వ్యవస్థ వైపు ఒక విప్లవాత్మక అడుగు. సేవలు, వస్తువులను ప్రతి పౌరుడికి సరసమైన ధరల్లో అందించడంలో ఈ చర్యలు ఉపయోగపడతాయి. తొలుత కొన్ని ఫిర్యాదులు, ఇబ్బందులు ఉండొచ్చు. ఇది కచ్చితంగా ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది’ అని ట్వీట్ చేశారు.
News September 22, 2025
పండగ కానుక.. 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు

కేంద్ర ప్రభుత్వం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పింది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన(PMUY) కింద దేశంలో కొత్తగా 25 లక్షల ఉచిత LPG కనెక్షన్స్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 10.60 కోట్లకు చేరుతుందని తెలిపారు. ‘ఇది మహిళా శక్తికి గొప్ప కానుక. PM మోదీ మహిళలను దుర్గా దేవిలా కొలుస్తారనడానికి ఇదే నిదర్శనం’ అని ఆయన ట్వీట్ చేశారు.
News September 22, 2025
ఎయిర్‌ఇండియా విమానంలో కలకలం

బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిర్‌ఇండియా ఫ్లైట్లో ఓ ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. దీనిపై ఎయిర్‌ఇండియా స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ప్రయాణికుడు టాయిలెట్ అనుకుని పొరపాటున కాక్‌పిట్ డోర్ తీయడానికి ప్రయత్నించాడని తెలిపింది. భద్రతా పరమైన సమస్య తలెత్తలేదని ప్రకటించింది. అతడిని CISF అదుపులోకి తీసుకుంది.