News September 22, 2025
బాలా త్రిపుర సుందరి దేవిగా ఉజ్జయిని మహాకాళి

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ప్రారంభించారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థమై అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు.
Similar News
News September 22, 2025
GST సంస్కరణలతో సామాన్యులకు మేలు: జగన్

AP: GST సంస్కరణల తుది ప్రయోజనాలు వినియోగదారులకు అందుతాయని ఆశిస్తున్నట్లు మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. ‘ఇది సరళమైన, న్యాయమైన పన్ను వ్యవస్థ వైపు ఒక విప్లవాత్మక అడుగు. సేవలు, వస్తువులను ప్రతి పౌరుడికి సరసమైన ధరల్లో అందించడంలో ఈ చర్యలు ఉపయోగపడతాయి. తొలుత కొన్ని ఫిర్యాదులు, ఇబ్బందులు ఉండొచ్చు. ఇది కచ్చితంగా ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది’ అని ట్వీట్ చేశారు.
News September 22, 2025
అనకాపల్లిలో EVM గిడ్డంగులను తనిఖీ చేసిన కలెక్టర్

అనకాపల్లి SP కార్యాలయం వద్ద ఉన్న EVM గిడ్డంగులను కలెక్టర్ విజయకృష్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సోమవారం తనిఖీ చేశారు. CC కెమెరాల పనితీరును పరిశీలించారు. ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను తనిఖీ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లాక్ బుక్ నిర్వహణ ఇతర అంశాలపై రాజకీయ నాయకుల ప్రతినిధులతో చర్చించారు. ఈ తనిఖీల్లో RDO షేక్ ఆయిషా పాల్గొన్నారు.
News September 22, 2025
NZB: కలెక్టరేట్ ప్రజావాణికి 89 ఫిర్యాదులు

నిజామాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 89 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్‌తో పాటు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.