News September 22, 2025
వేరుశనగలో ముదురు ఆకుమచ్చ తెగులు లక్షణాలు

వేరుశనగలో ముదురు ఆకుమచ్చ తెగులు పంట నాటిన 25 నుంచి 35 రోజుల తర్వాత ఎప్పుడైనా ఆశించవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గడం, ఆకులపై మంచు ఉండటం, అధిక వర్షం, అధిక నత్రజని వాడకం, మెగ్నీషియం లోపం ఈ తెగులు వ్యాప్తికి కారణమవుతుంది. ఈ తెగులు వల్ల ఆకుల అడుగు భాగం, కాండం, ఊడలపైనా ముదురు రంగులో గుండ్రని మచ్చలు కనిపిస్తాయి. తర్వాత దశలో ఈ మచ్చలు అన్నీ ఒక దానితో ఒకటి కలిసిపోయి ఆకులు పండుబారి రాలిపోతాయి.
Similar News
News September 22, 2025
ఆడపిల్ల కోసం ఓ చందనం మొక్క

బిహార్‌లోని వైశాలి జిల్లా పకోలి గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. అక్కడ ఆడపిల్ల పుడితే ఇంటి ఆవరణలో చందనం మొక్కను నాటుతారు. దాన్ని జాగ్రత్తగా సంరక్షించి కుమార్తె పెద్దయ్యాక ఆ చెట్టును అమ్మగా వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్లి చేస్తారు. వీరు పెంచే మల్యగిరి రకం చందనం చెట్లు విక్రయిస్తే, దాని వయసును బట్టి రూ.2 లక్షల వరకు వస్తాయని గ్రామస్థులు చెబుతున్నారు. పిల్లల ఉన్నత విద్య కోసం కూడా కొందరు వీటిని పెంచుతున్నారు.
News September 22, 2025
బండిపై క్యాస్ట్ పేరుంటే జరిమానా!

అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు కుల వివక్షను రూపు మాపేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. ‘క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్‌లో నేరస్థుల కులానికి బదులు పేరెంట్స్ పేర్లు పెట్టాలి. PSలో నిందితుల పేర్లు ప్రదర్శించేటప్పుడు కుల ప్రస్తావన వద్దు. వాహనాలపై కులం పేరు, కులాన్ని కీర్తిస్తూ స్లోగన్స్/కోట్స్ ఉంటే ఫైన్ వేయాలి. SMలో ఏ కులాన్నైనా కీర్తించినా/కించపరిచినా చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొంది.
News September 22, 2025
రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్

సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. త్వరలో పాక్‌తో జరగనున్న వైట్ బాల్ సిరీస్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నారు. SA మేనేజ్‌మెంట్ తాజాగా ప్రకటించిన వన్డే, టీ20 స్క్వాడ్స్‌లో డికాక్‌ను చేర్చింది. 2023 వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు, 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20లకు డికాక్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.