News September 22, 2025

గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ స్పందన

image

గాజులరామారంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అక్కడ నకిలీ పట్టాలతో భూములు కబ్జా చేశారని వెల్లడించారు. నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేసి భూములను అమ్మారన్నారు. ఆ భూముల విలువ రూ.15వేల కోట్లు ఉంటుందని, కబ్జా చేసిన వారిలో రౌడీషీటర్లు ఉన్నారని రంగనాథ్‌ తెలిపారు. కబ్జా చేసిన వాటిలో 30శాతమే కూల్చేశామని, కూల్చినవి కూడా నిర్మాణంలో ఉన్నవేనన్నారు. సోషల్‌మీడియాలో దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.

Similar News

News September 22, 2025

HYD: పులి వచ్చిందంటూ గ్రామస్థుల భయాందోళన..!

image

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌ మండలం పొన్నాల గ్రామంలోని పంట పొలాల్లోకి పులి వచ్చిందని గ్రామస్థులు ఈరోజు తెలిపారు. రెండు మూడు రోజుల నుంచి తమకు పులి అడుగులు కనిపిస్తున్నాయన్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగక ముందే అటవీ అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. కాగా అవి పులి అడుగులని కొందరు.. కాదు చిరుతపులి అడుగులని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా అధికారులు తమ గ్రామానికి రావాలని కోరుతున్నారు.

News September 22, 2025

చెన్నయ్ షాపింగ్ మాల్‌లో దసరా సంబరాలు

image

HYD: దసరా, దీపావళి సందర్భంగా ప్రత్యేక సంబరాలు ప్రారంభించినట్లు చెన్నయ్ షాపింగ్ మాల్ యాజమాన్యం తెలిపింది. అందుబాటు ధరల్లో సరికొత్త కలెక్షన్స్, షాపింగ్ చేసిన వినియోగదారులకు ప్రత్యేక బహుమతులు ఉన్నట్లు పేర్కొంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది.

News September 22, 2025

HYD: 923 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడాం: కమిషనర్

image

హైడ్రా ఇప్పటివరకు 923 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.50 వేల కోట్లు ఉంటుందని, HYDలో 60 చెరువులు కనుమరుగయ్యాయని, అయితే ఆరింటికి పునరుజ్జీవం కల్పించామన్నారు. గాజులరామారంలో నకిలీ పట్టాలతో నిర్మించిన 260 నిర్మాణాలను తొలగించినట్లు తెలిపారు.