News September 22, 2025
ప్రభుత్వానికి సింగరేణి ఆత్మలాంటిది: భట్టి

TG: రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి ఆత్మలాంటిదని కార్మికులకు <<17791980>>బోనస్<<>> ప్రకటన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. లాభాల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగులకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి నిర్ణయించినట్లు చెప్పారు. గత పదేళ్లుగా సంస్థ వేలంలో పాల్గొనకపోవడంతో రెండు బ్లాక్‌లను కోల్పోయిందన్నారు. దీంతో ఆ రెండు బ్లాక్‌లు అప్పటి ప్రభుత్వ నేతల సన్నిహితుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు.
Similar News
News September 22, 2025
ఇంకా వంద రోజులే ఉంది మిత్రమా!

చాలామంది కొత్త ఏడాది ప్రారంభంలో కొన్ని గోల్స్ పెట్టుకుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే వాటిని రీచ్ అవుతారు. మీరు పెట్టుకున్న గోల్స్, చేయాలనుకున్న పనిని పూర్తిచేసేందుకు ఇంకా కొంత సమయమే మిగిలి ఉంది. ఎందుకంటే ఇంకా వంద రోజుల్లో 2025 ముగియనుంది. ఈ కొంత సమయాన్నైనా సద్వినియోగం చేసుకొని, మీ లక్ష్యాలను నెరవేర్చుకోండి. ఇన్నిరోజులూ వాయిదా వేసిన పనులను పూర్తి చేయండి. ALL THE BEST
News September 22, 2025
విజయవాడ ఉత్సవ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి: కేశినేని చిన్ని

AP: విజయవాడ ఉత్సవ్‌కు అడ్డంకులు తొలగిపోయాయని MP కేశినేని చిన్ని తెలిపారు. ‘ఎగ్జిబిషన్ ఏర్పాటుకు SC గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. SEP 24 నుంచి ఎగ్జిబిషన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. కృష్ణా నది వరద ఉద్ధృతి కారణంగా వాటర్ స్పోర్ట్స్ రద్దు చేశాం. ఉద్ధృతి తగ్గాక ఆ స్పోర్ట్స్ నిర్వహిస్తారు’ అని చెప్పారు. ఉత్సవ్‌లో భాగంగా గొల్లపూడి వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను TDP నేతలు ఉదయం ప్రారంభించారు.
News September 22, 2025
ఆప్కో వస్త్రాలపై 40% డిస్కౌంట్: మంత్రి సవిత

AP: దసరా, దీపావళి సందర్భంగా APCO వస్త్రాలపై 40% రిబేట్ అందిస్తున్నట్లు చేనేత, జౌళి మంత్రి సవిత ప్రకటించారు. సంస్థ షోరూములలో ఈ రాయితీ అమలవుతుందని తెలిపారు. ఈ కామర్స్‌లో అమ్మకాలతో పాటు డోర్ డెలివరీ కూడా ఆప్కో చేస్తుందన్నారు. చేనేత వస్త్రాలు తెలుగు సంస్కృతికి ప్రతిబింబమని, ఈ నిర్ణయంతో ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు. అదే సమయంలో కొనుగోళ్లు పెరిగి చేనేత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు.