News September 22, 2025

అనకాపల్లి నూకాంబిక ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

image

అనకాపల్లి శ్రీనూకాంబిక అమ్మవారు ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ముందుగా గణపతి పూజ, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ చేశారు. అనంతరం దసరా ఉత్సవాలను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ సుధారాణి, ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ పీలా నాగశ్రీలు పాల్గొన్నారు.

Similar News

News September 22, 2025

రాయికల్: ఆదివాసి తోటి సంక్షేమ జిల్లా అధ్యక్షుడిగా ప్రసన్నకుమార్

image

ఆదివాసి తోటి సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాయికల్‌కు చెందిన కురిసెంగ ప్రసన్నకుమార్‌ను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ అత్రం కమల్ మనోహర్ తెలిపారు. తోటి కుల హక్కుల కోసం ప్రసన్నకుమార్ చేసిన కృషిని గుర్తించి ఈ పదవి అప్పగించినట్లు చెప్పారు. పీటీజీ వర్గాల అభివృద్ధి, ఫేక్ కుల సర్టిఫికెట్లపై చర్యలు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు.

News September 22, 2025

ఇంకా వంద రోజులే ఉంది మిత్రమా!

image

చాలామంది కొత్త ఏడాది ప్రారంభంలో కొన్ని గోల్స్ పెట్టుకుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే వాటిని రీచ్ అవుతారు. మీరు పెట్టుకున్న గోల్స్, చేయాలనుకున్న పనిని పూర్తిచేసేందుకు ఇంకా కొంత సమయమే మిగిలి ఉంది. ఎందుకంటే ఇంకా వంద రోజుల్లో 2025 ముగియనుంది. ఈ కొంత సమయాన్నైనా సద్వినియోగం చేసుకొని, మీ లక్ష్యాలను నెరవేర్చుకోండి. ఇన్నిరోజులూ వాయిదా వేసిన పనులను పూర్తి చేయండి. ALL THE BEST

News September 22, 2025

HYD: మరో 3 గంటలు జర జాగ్రత్త..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొడుతోంది. రానున్న 2-3 గంటలు ఈ వర్షం ఇలాగే కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మీ ప్రాంతంలో వర్షం కురుస్తుందా కామెంట్ చేయండి. SHARE IT