News September 22, 2025

పాలమూరు: రోడ్డు ప్రమాదంలో బావ, మరదలు మృతి

image

<<17789391>>మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం రోడ్డు ప్రమాదం<<>> చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో బావ, మరదలు మృతి చెందారు. పాన్‌గల్(M) చిక్కేపల్లి వాసి రంజిత్ కుమార్ రెడ్డి(35), ఆయన భార్య చెల్లి హారిక(25) కారులో HYD వెళ్తున్నారు. ఈ క్రమంలో అటువైపు అతివేగంగా వస్తున్న మరో కారు డివైడర్‌ను ఢీకొట్టి రంజిత్, హారికలు ప్రయాణిస్తున్న కారుపై పడింది. దీంతో వారిద్దరూ స్పాట్‌లోనే మరణించారు.

Similar News

News September 22, 2025

NZB: ఇందిరమ్మ చీర అని పెడితే ఊరుకోం: కవిత

image

మహిళలకు ఇచ్చే చీరలకు బతుకమ్మ చీరలు లేదంటే తెలంగాణ ఆడబిడ్డల చీర అని పేరు పెట్టాలని, ఇందిరమ్మ చీర అని పేరు పెడితే మాత్రం ఊరుకునేది లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆమె మాట్లాడారు. ఆడబిడ్డలకు ఒకటి కాదు, రెండు చీరలిస్తామని గతంలో హామీ ఇచ్చారన్నారు.

News September 22, 2025

రాజోలు టీడీపీ ఇన్‌‌ఛార్జ్‌గా గొల్లపల్లి అమూల్య

image

రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇన్‌‌ఛార్జ్‌గా గొల్లపల్లి అమూల్య నియమితులయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని, దీనికి సంబంధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఎంతో కాలంగా కొనసాగుతున్న ఈ నియామక ప్రక్రియ కొలిక్కి రావడంతో జోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు పలువురు హర్షం వ్యక్తం చేశారు.

News September 22, 2025

చిత్తూరు కలెక్టర్‌కు 348 అర్జీలు

image

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి 348 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు విభాగాలకు చెందిన సమస్యలను ఆయన స్వయంగా విని సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.