News September 22, 2025

రాష్ట్రంలో 42 పోస్టులు.. దరఖాస్తుల సవరణకు కొన్ని గంటలే ఛాన్స్

image

<>ఏపీలో<<>> 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు దరఖాస్తులో తప్పుగా నమోదు చేశారా? అలాంటి వారికి ముఖ్య గమనిక. తప్పుల సవరణకు ఇవాళ సాయంత్రం 5గంటల వరకు అవకాశం ఉంది. వివరాలు తప్పుగా నమోదు చేసినవారు సవరణ చేసుకోవచ్చని పోలీస్ నియామక మండలి తెలిపింది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 7వరకు దరఖాస్తులను స్వీకరించింది.

Similar News

News September 22, 2025

స్వచ్ఛమైన ప్రకృతి వనరులను అందించాలి: పవన్

image

AP: పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే కాలుష్యాన్ని నియంత్రించేలా ముందుకెళ్లాలని Dy.CM పవన్ పేర్కొన్నారు. అటవీ, పర్యావరణ ముఖ్య కార్యదర్శితో ఆయన భేటీ అయ్యారు. ‘కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలి. మండలి విధులు, నిధులు, ప్రస్తుత పరిస్థితి ప్రజలకు అర్థమయ్యేలా సమగ్ర నివేదిక సిద్ధం చేయండి. సాధ్యమైనంత స్వచ్ఛంగా ప్రకృతి వనరులను భావి తరాలకు అందించే లక్ష్యంతో పని చేయాలి’ అని దిశానిర్దేశం చేశారు.

News September 22, 2025

గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం: రవూఫ్ భార్య

image

పాక్ మ్యాచ్ ఓడిపోయినా తన భర్త చేసిన పనితో గర్వంగా ఉన్నానని ఆ జట్టు బౌలర్ హారిస్ రవూఫ్ భార్య ముజ్నా మసూద్ తెలిపింది. నిన్న మ్యాచ్ సందర్భంగా రవూఫ్ ‘ఆపరేషన్ సిందూర్’లో భారత్ 6 ఫైటర్ జెట్లను కోల్పోయిందని వేళ్లతో <<17788891>>సంజ్ఞలు<<>> చేశాడు. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ముజ్నా.. ‘గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం’ అని పేర్కొంది. యుద్ధమైనా, ఆటైనా గెలిచేది భారతే అని టీమ్ ఇండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

News September 22, 2025

మైథాలజీ క్విజ్ – 13 సమాధానాలు

image

1. దశరథుణ్ని వరాలు కోరమని కైకేయిని ప్రేరేపించింది ఆమె దాసి అయిన ‘మంధర’.
2. మహాభారతంలో కాశీరాజు పుత్రికలు అంబ, అంబిక, అంబాలిక.
3. కృష్ణుడిని చంపడానికి అఘాసురుడు భారీ కొండచిలువ రూపం ధరించాడు.
4. శ్రీశైలంలోని భ్రమరాంబికా దేవి కృష్ణా నది తీరాన కొలువై ఉంది.
5. శ్రీరాముడు రావణుడిని సంహరించిన సందర్భంగా దసరా పండుగను జరుపుకొంటారు.
<<-se>>#mythologyquiz<<>>