News September 22, 2025

₹500 కోట్లతో NTTPS కాలుష్య నివారణ పనులు

image

AP: NTTPS కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. పొల్యూషన్ రాకుండా ప్లాంటులో ₹500కోట్లతో పరికరాలు సమకూరుస్తున్నామన్నారు. ’పాండ్‌యాష్ నిల్వ, తరలింపుతోనే ఈ సమస్య. కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు, యాష్ రవాణాకు టెండరింగ్ ఏజెన్సీని నియమించాం. ఏజెన్సీ ఏర్పాటుపై అపోహలొద్దు.’ అని పేర్కొన్నారు. స్థానికుల ఉపాధి దృష్ట్యా ఉచితంగా బూడిద లోడింగ్‌‌, రవాణా ఖర్చులు అందిస్తున్నామన్నారు.

Similar News

News September 22, 2025

పరకామణిపై CBI విచారణ చేయాలి: YCP

image

AP: తిరుమల <<17772428>>పరకామణి<<>> వివాదంపై CBI విచారణ, SC నేతృత్వంలో జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని YCP డిమాండ్ చేసింది. CJI గవాయ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వైసీపీ MP గురుమూర్తి లేఖలు రాశారు. హుండీ సొమ్ము చోరీ జరిగిందన్న ఆరోపణల వెనుక రాజకీయ దురుద్ధేశాలు ఉన్నాయన్నారు. సరైన ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే తిరుమలను పవిత్రంగా భావించే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని అసహనం వ్యక్తం చేశారు.

News September 22, 2025

నక్సలైట్లపై మరో మేజర్ విక్టరీ: అమిత్‌షా

image

నక్సలైట్లపై భద్రతా బలగాలు మరో మేజర్ విక్టరీ సాధించాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్(D) అబూఝ్‌మాడ్ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డిలను మట్టుబెట్టాయని ట్వీట్ చేశారు. బలగాలు ప్లాన్ ప్రకారం నక్సల్స్ టాప్ లీడర్స్‌ను అంతమొందిస్తున్నాయని అన్నారు. కాగా చనిపోయిన ఇద్దరిపై రూ.40 లక్షల చొప్పున రివార్డు ఉంది.

News September 22, 2025

సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్

image

TG: గోదావరి నదిపై సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. NOCకి అంగీకరిస్తున్నట్లు విష్ణుదేవ్ తెలిపారు. భూసేకరణ, నష్టపరిహారం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. 6.7 టీఎంసీల సామర్థ్యంతో ములుగు జిల్లాలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.