News September 22, 2025
జగిత్యాల: క్రీడలతో పోటీ భావన పెరుగుతుంది: SP

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రికెట్ & బ్యాట్మెంటన్ పోటీల్లో విజేతలుగా నిలిచిన పోలీస్ టీం సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మన శారీరక ఆరోగ్యానికి బలాన్ని అందించడమే కాకుండా, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. క్రీడలతో మనలో పోటీ భావన పెరుగుతుందని, అలాగే సహచరులను ప్రోత్సహించే స్ఫూర్తి కూడా వస్తుందని పేర్కొన్నారు.
Similar News
News September 22, 2025
నక్సలైట్లపై మరో మేజర్ విక్టరీ: అమిత్‌షా

నక్సలైట్లపై భద్రతా బలగాలు మరో మేజర్ విక్టరీ సాధించాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్(D) అబూఝ్‌మాడ్ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డిలను మట్టుబెట్టాయని ట్వీట్ చేశారు. బలగాలు ప్లాన్ ప్రకారం నక్సల్స్ టాప్ లీడర్స్‌ను అంతమొందిస్తున్నాయని అన్నారు. కాగా చనిపోయిన ఇద్దరిపై రూ.40 లక్షల చొప్పున రివార్డు ఉంది.
News September 22, 2025
ప్రాజెక్టుల కోసం భూసేకరణ ప్రతిపాదనలు సమర్పించండి: కలెక్టర్

జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, సంక్షేమ వసతి గృహాలు, రోడ్లు–భవనాల నిర్మాణం వంటి పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రతి ప్రాజెక్టుకు ఎంత భూమి అవసరమవుతుందో స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
News September 22, 2025
అనకాపల్లిలో PGRSలో 31 ఫిర్యాదులు

జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో ఎస్పీ తుహిన్ సిన్హా 31 ఫిర్యాదులను స్వీకరించారు. భూ తగాదాలు 16, కుటుంబ కలహాలు 3, మోసాలు 3, ఇతర ఫిర్యాదులు 9గా గుర్తించామన్నారు. ప్రతి ఫిర్యాదుపై నిశితంగా విచారణ చేసి 7 రోజుల్లో పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజలకు వేగంగా న్యాయం అందించడం పోలీసుల ప్రధాన కర్తవ్యని స్పష్టం చేశారు.