News September 22, 2025

రైల్‌నీర్ వాటర్ బాటిల్ @రూ.14

image

GST శ్లాబుల సవరణలతో ఇవాళ్టి నుంచి రైళ్లలో లభించే రైల్‌నీర్ వాటర్ బాటిల్ ధరను రైల్వే శాఖ తగ్గించింది. ఇప్పటివరకూ 1L బాటిల్‌పై రూ.15గా ఉన్న ధర రూ.14కు తగ్గింది. అలాగే గతంలో రూ.10గా ఉన్న 500 మి.లీ. బాటిల్ ₹9కే లభించనుంది. అయితే ఎక్కువ ధరలకు విక్రయిస్తే 139కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ప్రతి రూపాయి ముఖ్యమే కాబట్టి తగ్గిన ధరలను గమనించి చిల్లరను అడిగి తీసుకోండి. SHARE IT

Similar News

News September 22, 2025

రెండు రోజుల క్రితం లేఖ.. ఇవాళ హతం

image

ఆయుధాలు వదిలే ప్రసక్తే లేదంటూ ప్రకటించిన రెండు రోజులకే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా <<17796054>>రామచంద్రారెడ్డి<<>> ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఆయుధాలు వదిలేస్తామంటూ అభయ్ పేరుతో ఇటీవల లేఖలు కలకలం రేపాయి. ఆ ప్రకటన పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ ఈ నెల 20న లేఖ విడుదల చేశారు. అది తాజాగా బయటకు రావడం, ఆయన మరణించడం చర్చనీయాంశమైంది.

News September 22, 2025

పవన్ ‘OG’కి ‘A’ సర్టిఫికెట్.. 1AM షో క్యాన్సిల్

image

‘OG’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే ఈ సినిమా పెద్దలకు మాత్రమే అని అర్థం. మూవీలో విపరీతమైన వైలెన్స్ కారణంగానే A సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా రన్ టైమ్‌ను 2.34 గంటలకు(154ని. 15 సెకన్లు) లాక్ చేశారు. అటు ఏపీలో 25న 1AM షోను క్యాన్సిల్ చేసి 24న రాత్రి 10 గం.ల ప్రీమియర్ షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.

News September 22, 2025

పరకామణిపై CBI విచారణ చేయాలి: YCP

image

AP: తిరుమల <<17772428>>పరకామణి<<>> వివాదంపై CBI విచారణ, SC నేతృత్వంలో జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని YCP డిమాండ్ చేసింది. CJI గవాయ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వైసీపీ MP గురుమూర్తి లేఖలు రాశారు. హుండీ సొమ్ము చోరీ జరిగిందన్న ఆరోపణల వెనుక రాజకీయ దురుద్ధేశాలు ఉన్నాయన్నారు. సరైన ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే తిరుమలను పవిత్రంగా భావించే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని అసహనం వ్యక్తం చేశారు.