News September 22, 2025

HYD: 923 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడాం: కమిషనర్

image

హైడ్రా ఇప్పటివరకు 923 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.50 వేల కోట్లు ఉంటుందని, HYDలో 60 చెరువులు కనుమరుగయ్యాయని, అయితే ఆరింటికి పునరుజ్జీవం కల్పించామన్నారు. గాజులరామారంలో నకిలీ పట్టాలతో నిర్మించిన 260 నిర్మాణాలను తొలగించినట్లు తెలిపారు.

Similar News

News September 22, 2025

నెక్సస్ HYD మాల్ 11వ వార్షికోత్సవ వేడుకలు

image

నెక్సస్ హైదరాబాద్ మాల్ 11వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ‘City Under Siege’ పేరుతో సౌతిండియాలోనే తొలి అనిమాట్రానిక్ అలియన్స్ ఇన్‌స్టాలేషన్‌ను అందిస్తోంది. లైఫ్-సైజ్డ్ అలియన్స్, అలియన్ రైడ్, థీమ్ వర్క్‌షాప్స్‌తో వినూత్న అనుభవాన్ని అక్టోబర్ 31 వరకు పొందవచ్చు. అలాగే అక్టోబర్ 2 వరకు షాపింగ్ ఫెస్టివల్‌లో లగ్జరీ కార్, గోల్డ్, సిల్వర్, గాడ్జెట్లు గెలిచే అవకాశం ఉంది.

News September 22, 2025

HYD: అమెరికాలో దౌత్య సంబంధాల్లో కేంద్రం విఫలం: మంత్రి

image

అమెరికాలో దౌత్య సంబంధాల్లో కేంద్రం విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. భారతీయుల చదువు, ఉద్యోగ అవకాశాలపై అమెరికా నిబంధనలు ఆటంకంగా మారుతున్నాయని, ఇతర దేశాల ప్రభుత్వం కంపెనీలకు రెడ్‌ కార్పెట్‌ ఆహ్వానం ఇస్తుండగా, కేంద్రం సరైన దౌత్య చర్యలు తీసుకోలేదన్నారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ వారు తిరిగి తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి సూచించారు.

News September 22, 2025

HYD: 26 లక్షల మంది ప్రయాణికులు.. బస్సులు 3,200..!

image

HYD నుంచి వివిధ జిల్లాలు, పట్టణాలకు ఆర్టీసీ కేవలం 3,200 బస్సులు మాత్రమే నడిపిస్తుండడంతో ఇబ్బందులు కలుగుతున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. 26 లక్షల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా సరిపడా బస్సులు లేకపోవడంతో కిక్కిరిసి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.