News September 22, 2025
పండగ కానుక.. 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు

కేంద్ర ప్రభుత్వం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పింది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన(PMUY) కింద దేశంలో కొత్తగా 25 లక్షల ఉచిత LPG కనెక్షన్స్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 10.60 కోట్లకు చేరుతుందని తెలిపారు. ‘ఇది మహిళా శక్తికి గొప్ప కానుక. PM మోదీ మహిళలను దుర్గా దేవిలా కొలుస్తారనడానికి ఇదే నిదర్శనం’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News September 22, 2025
యూరియాతో తీవ్ర నష్టం: సీఎం

AP: యూరియా ఎక్కువగా వాడటం వల్ల పాలు కూడా కలుషితం అవుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘యూరియా వల్ల ప్రజారోగ్యం, పంట ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. రసాయనాలు, యూరియా అధిక వినియోగంపై రైతుల్ని చైతన్యపర్చాల్సి ఉంది. బాధ్యతలేని నాయకులు ఎరువులు ఇవ్వలేదని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సర్టిఫికేషన్ ఇచ్చిన ఆహారాన్నే తీసుకుంటున్న ఆ నేతలు రైతులను మోసగిస్తున్నారు’ అని అసెంబ్లీలో విమర్శించారు.
News September 22, 2025
INDvsPAK: మరోసారి ICCకి PCB ఫిర్యాదు!

భారత్, పాక్ మ్యాచ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ICCకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నిన్నటి మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్‌ను <<17794224>>ఔట్‌గా<<>> ప్రకటిస్తూ థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించినట్లు సమాచారం. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు పాక్ మీడియా పేర్కొంది. కాగా అంతకుముందు హ్యాండ్ షేక్ వివాదం నేపథ్యంలో రిఫరీ పైక్రాఫ్ట్‌పై PCB <<17717948>>ఫిర్యాదు<<>> చేసి భంగపడిన విషయం తెలిసిందే.
News September 22, 2025
TGPSCకి ముగ్గురు కొత్త సభ్యులు

TGPSCకి కొత్తగా ముగ్గురు సభ్యులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రకాంత్ రెడ్డి, విశ్వప్రసాద్ (IPS), ప్రొఫెసర్ L.B.లక్ష్మీకాంత్ రాథోడ్‌లను సభ్యులుగా నియమించింది. వీరు ఆరేళ్ల పాటు లేదా వారికి 62 ఏళ్లు వచ్చేంత వరకు పదవుల్లో కొనసాగుతారని పేర్కొంది.