News September 22, 2025
అనకాపల్లిలో EVM గిడ్డంగులను తనిఖీ చేసిన కలెక్టర్

అనకాపల్లి SP కార్యాలయం వద్ద ఉన్న EVM గిడ్డంగులను కలెక్టర్ విజయకృష్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సోమవారం తనిఖీ చేశారు. CC కెమెరాల పనితీరును పరిశీలించారు. ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను తనిఖీ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లాక్ బుక్ నిర్వహణ ఇతర అంశాలపై రాజకీయ నాయకుల ప్రతినిధులతో చర్చించారు. ఈ తనిఖీల్లో RDO షేక్ ఆయిషా పాల్గొన్నారు.
Similar News
News September 22, 2025
GHMC వ్యాప్తంగా ప్రజావాణికి 156 విన్నపాలు

HYD ఖైరతాబాద్‌లోని GHMC ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణికి మొత్తం 156 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను అధికారులు స్వీకరించారు. సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాగా మేయర్, కమిషనర్ రాకపోవడంతో పలువురు ఫిర్యాదుదారులు వెనక్కి వెళ్లిపోయారు.

ప్రజావాణి అర్జీలకు వెంటనే స్పందించండి: HYD కలెక్టర్

HYD జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధ్యక్షతన సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన 167 దరఖాస్తులను స్వీకరించారు. హౌసింగ్ (99), పెన్షన్స్ (31), రెవెన్యూ (16), ఇతర శాఖల (21) అర్జీలు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు శాఖల వారీగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వయోవృద్ధుల అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.