News September 22, 2025
రంపచోడవరం: గ్రీవెన్స్‌లో 98 అర్జీలు

రంపచోడవరం ITDA కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో 98 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు. PO. స్మరణ్ రాజ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్నిటిని అక్కడే పరిష్కరించారు. మిగిలినవి సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపించారని పేర్కొన్నారు. ప్రతీ అర్జీని బాధ్యతయుతంగా పరిష్కరించాలని PO ఆదేశించారు.
Similar News
News September 22, 2025
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలి: డీఎంహెచ్‌ఓ

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి అన్నారు. సోమవారం పాల్వంచలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె సూచనలు చేశారు గర్భిణీలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆమె ఆదేశించారు. శిశువులకు పూర్తి స్థాయిలో టీకాలు అందేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ పుల్లారెడ్డి పాల్గొన్నారు.
News September 22, 2025
GHMC వ్యాప్తంగా ప్రజావాణికి 156 విన్నపాలు

HYD ఖైరతాబాద్‌లోని GHMC ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణికి మొత్తం 156 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను అధికారులు స్వీకరించారు. సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాగా మేయర్, కమిషనర్ రాకపోవడంతో పలువురు ఫిర్యాదుదారులు వెనక్కి వెళ్లిపోయారు.